అద్భుత ఆయుర్వేద చిట్కాతో డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.! ఎలాగంటే.? 

 ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ వ్యాధి ప్రధానమైనదిగానే చెప్పొచ్చు.

 డయాబెటిస్ వ్యాధి బారిన ఒకసారి పడితే బయటపడటం చాలా కష్టం.నియంత్రించుకోవడం ఒకటే మార్గం.డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయారా

 అయితే ఆయుర్వేద వైద్యంలో చింత గింజలను ఉపయోగించి డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచవచ్చునని నిపుణులు చెబుతున్నారు.ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 సాధారణంగా మనం చింతకాయ నుంచి చింతపండును తీసుకున్న తర్వాత చింత గింజలను వృధాగా పడేస్తుంటాం.

 మనకు తెలియని విషయం ఏమిటంటే చింతగింజల్లో మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్స్,ప్రొటీన్స్, మినరల్స్,ఎమినో యాసిడ్స్, ఫ్యాటి ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉన్నాయి.

 అలాగే ఇందులో మెండుగా యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉండడంతో మనలో వ్యాధి కారకాలను తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.

 కావున ప్రతిరోజు చింత గింజల కషాయాన్ని సేవిస్తే మనలో వ్యాధి నిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది.

 చింత గింజల్లో సమృద్ధిగా లభించే డైటరీ ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

 ప్రతిరోజు చింత గింజల పొడిని పాలల్లో కలుపుకొని సేవిస్తే వీటిలో పుష్కలంగా ఉన్న పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్ రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది.

  చింత గింజల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్ గుణాలు మన శరీరంలో ప్రమాదకర క్యాన్సర్ కణాలు తొలగించి ఉదర క్యాన్సర్,పెద్ద ప్రేగు క్యాన్సర్లను నివారిస్తుంది.

 తరచూ కీళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారు చింత గింజల పొడిని పాలల్లో కలిపి సేవిస్తే కీళ్ల కదలికలకు ఉపయోగపడే ద్రవం ఉత్పత్తి అయ్యి కీళ్లనొప్పుల సమస్యను తగ్గిస్తుంది.

 మన ఇంట్లోనే చింత గింజల పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చింత గింజలను దోరగా వేయించిన తర్వాత గింజలను మర పట్టించి మెత్తటి పౌడ రూపంలో మార్చుకోవాలి.

 ఇలా తయారు చేసుకున్న చింత గింజల పొడిని గాజు జార్లో నిల్వ చేసుకొని ప్రతిరోజు కొద్ది పరిమాణంలో నీళ్లు లేదా పాలలో కలుపుకొని సేవిస్తే సరిపోతుంది.