వరల్డ్ వైడ్ స్ట్రాంగ్ గా దూసుకెళ్తున్న “ధమాకా” కలెక్షన్స్!

ఎనర్జిటిక్ హీరో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “ధమాకా” సూపర్ డూపర్ హిట్ కాగా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది.

సినిమా వచ్చి వారం అయ్యి 8వ రోజుకి వచ్చాక కూడా అంతే స్టాండర్డ్ వసూళ్లతో ఈ చిత్రం వసూళ్లు రాబడుతూ ఉండడం విశేషం.

అయితే ఈ చిత్రం నిన్న 7 రోజుల్లో వరల్డ్ వైడ్ 62 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అందుకోగా మళ్ళీ 8వ రోజు మరో 7 కోట్లు వసూలు చేయడంతో అయితే 69 కోట్ల మాసివ్ గ్రాస్ కి ఈ చిత్రం చేరుకుంది.

ఇక ఇదే కొనసాగితే మాత్రం ఈ చిత్రం సంక్రాంతి వరకు కూడా ఎలాంటి అడ్డు లేకుండా ఉంటుంది అని చెప్పాలి.

ఇక దీనితో పాటు ఈ చిత్రం అయితే సంక్రాంతి వరకు అడ్డు లేకుండా కొనసాగుతుంది అని చెప్పొచ్చు.

మరి 100 కోట్ల గ్రాస్ ని ఈ చిత్రం అందుకుంటుందా లేదా అనేది మాత్రం మంచి ఆసక్తిగా ఇప్పుడు మారింది.

ఇక ఈ సినిమాలో మాస్ మహారాజ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించింది అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించగా హిట్ దర్శకుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు.