ఎన్టీయార్‌ని కాదనేసింది.! చరణ్ కోసం వస్తుందా.?

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తే.! కానీ, తెలుగు సినీ పరిశ్రమ పట్ల జాన్వీ చిన్న చూపు ప్రదర్శిస్తోంది.

టాలీవుడ్ నుంచి ఎంతమంది దర్శక నిర్మాతలు జాన్వీ కపూర్‌ని సంప్రదిస్తున్నా, ఆమె ‘యెస్’ చెప్పడంలేదు.

యంగ్ టైగర్ ఎన్టీయార్ కొత్త సినిమా కోసం దర్శకుడు కొరటాల శివ తొలుత జాన్వీ కపూర్‌ని సంప్రదించాడు.

ఆమె ఔననీ చెప్పలేదు, కాదనీ చెప్పలేదు. విషయం నానుతూ వస్తోంది. ‘చేయాలని వుందిగానీ..’ అంటూ జాన్వీ సాగదీస్తోందిట.

ఇంతలోనే, టాలీవుడ్ నుంచే మరో ఆఫర్ జాన్వీ కపూర్‌ని వెతుక్కుంటూ వెళ్ళిందట.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం జాన్వీ కపూర్‌ని ట్రై చేస్తున్నారన్నది తాజా ఖబర్.

చరణ్ కోసం జాన్వీ వస్తుందా.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. జాన్వీ ‘నో’ చెబితే, కృతి శెట్టి వైపు దర్శకుడు బుచ్చిబాబు సన మొగ్గు చూపుతాడట.

బుచ్చిబాబు తొలి సినిమా ‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి. ఆ సినిమాతోనే ఆమె తెరంగేట్రం చేసింది.