“ఉస్తాద్ భగత్ సింగ్” పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన యూనిట్.!

 గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “హరిహర వీరమల్లు” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

 ఇక ఈ సినిమా తర్వాత మరో రెండు సాలీడ్ ప్రాజెక్ట్ లని పవన్ బ్యాక్ టు బ్యాక్ అనౌన్స్ చేయడం అనేది కూడా అత్యంత ఆసక్తిగా మారింది.

 ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రాల్లో కొన్ని మార్పులు చేసి అనౌన్స్ చేసిన చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి.

 దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న ఈ చిత్రం గత “భవదీయుడు భగత్ సింగ్” కి కొంచెం అప్డేట్ చేసిన వెర్షన్ లా అని చెప్పొచ్చు.

 ఇక ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది మళ్ళీ సస్పెన్స్ గా మారుతుంది అనే సమయంలో అయితే లేటెస్ట్ గా చిత్ర యూనిట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఇవ్వడం వైరల్ గా మారింది.

 ఈ చిత్రం ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో జరుపుతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసారు.

 మరి లేటెస్ట్ ఫోటో లో అయితే హరీష్ శంకర్ మరియు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి లు కూర్చొని ఓ భారీ ప్లానింగ్ చేస్తున్నట్టుగా తెలిపారు.

 దీనితో ఈ లేటెస్ట్ అప్డేట్ కేజ్రీగా మారింది.

 ఇక ఈ సినిమా కి అయితే దేవిశ్రీ ప్రసాద్ నే సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.