ఇండియా ప్రైడ్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) అంతకంతకు భారీ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ ని రేపిందో తెలిసిందే.
మెంటల్ మాస్ రెస్పాన్స్ తో ఈ సినిమా ఇంకా ప్రపంచ దేశాల్లో అదరగొడుతుంది.
సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ ఎవరొక హాలీవుడ్ సెలెబ్రెటీ సినిమాపై ప్రశంసలు అందిస్తూనే ఉన్నారు.
ఇక యూఎస్ స్టేట్ లో అయితే లేటెస్ట్ గా ఓ గ్రాండ్ ప్రీమియర్ ని చైనీస్ థియేటర్ ఐమ్యాక్స్ లో అక్కడి ఆడియెన్స్ కోసం ప్లాన్ చేయగా ఈ షో కి క్రేజీ రెస్పాన్స్ రావడం గమనార్హం.
మరి ఇది ఎంతలా అంటే ఈ ఐమ్యాక్స్ లో మొత్తం 932 టికెట్స్ ఉండగా ఇవన్నీ కేవలం 90 సెకండ్స్ లోనే సోల్డ్ అవుట్ అయ్యిపోయాయి అట.
దీని బట్టి విదేశీ గడ్డపై RRR క్రేజ్ ఏ లెవెల్లో ఉందో మనం అర్ధం చేసుకోవాలి.
మరి దీనితో ఇది ఓ రికార్డు కాగా దీనితో చిత్ర యూనిట్ కూడా ఈ మాస్ రెస్పాన్స్ కి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ భారీ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటించగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారు.
అలాగే ఆలియా భట్, ఒలీవియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ భారీ చిత్రం ఇప్పుడు ఆస్కార్ వరకు వెళ్లనుంది.