కరోనా కేసులు పెరుగుతున్నాయి.. తెలుగు రాష్ట్రాల సీఎంలు జాగ్రత్త పడాల్సిందే!

 ఈ ఏడాది ప్రజలను కరోనా భయం ఎక్కువగా వెంటాడలేదనే సంగతి తెలిసిందే. తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో కరోనా కష్టాలు తీరినట్టేనని అందరూ భావించారు.

 గత కొన్ని రోజులుగా చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నట్టు వార్తలు వస్తుండగా మన దేశంలోకి కూడా కొత్త కరోనా వేరియంట్ ఎంట్రీ ఇచ్చిందని తెలిసి షాకవ్వడం ప్రజల వంతవుతోంది.

 రాబోయే రోజుల్లో కరోనా కేసులు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.బీఎఫ్7 అనే కరోనా కొత్తరకం వేరియంట్ కు సంబంధించిన మూడు కేసులు ప్రస్తుతం దేశంలో నమోదయ్యాయి.

 విదేశాల నుంచి వచ్చిన వాళ్లలో ఈ కొత్త వేరియంట్ ను గుర్తించడం జరిగింది. అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేసులు పెరగకుండా ఇప్పటినుంచి అప్రమత్తమైతే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 కరోనా కేసులు పెరిగితే వేర్వేరు రంగాలపై తీవ్రస్థాయిలో ప్రభావం పడుతుంది.కరోనా కేసులు ఊహించని స్థాయిలో పెరిగిన సమయంలో ఉద్యోగులు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.

 ఇప్పటినుంచి ప్రజలకు అవగాహన కల్పిస్తే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసినట్టు అవుతుంది.

 ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు సైతం ఈ వేరియంట్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు సైతం మరింత జాగ్రత్తగా ఉంటే మంచిది.కరోనా వైరస్ దేశ ఆర్థిక పరిస్థితిపై కూడా తీవ్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉంటాయి.

 జగన్, కేసీఆర్ ప్రభుత్వాలు కేసులు పెరగకుండా ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి.

 ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ వేయించుకోని వారు వ్యాక్సిన్ తీసుకునేలా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పవచ్చు.