కన్ఫర్మ్ : “హరిహర వీరమల్లు” కొత్త గ్లింప్స్ డేట్ ఖరారు.!

గత కొన్ని రోజులు కితమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రం

“హరిహర వీరమల్లు” నుంచి పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్ లు అలాగే కొన్ని ఫోటోలు బయటకి రావడంతో మరింత స్థాయి హైప్ నెలకొంది.

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు షూటింగ్ పై కూడా లేటెస్ట్ అప్డేట్ కూడా ఇప్పుడు మేకర్స్ సహా దర్శకుడు క్రిష్ అందించారు.

ఈ చిత్రంలో కీలక భారీ ఏక్షన్ సన్నివేశాన్ని అయితే నిన్నటితో తెరకెక్కించామని ఇన్స్టా లో తెలిపారు.

ఇక దీనితో ఈ అప్డేట్ ఇప్పుడు వైరల్ గా మారగా ఈ సినిమా నుంచి ఈ డిసెంబర్ 31న ఓ కొత్త గ్లింప్స్ ని అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా కొన్ని రూమర్స్ బయటకి వచ్చాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా ఖుషి ఆరోజు రిలీజ్ చేస్తుండగా దానితో అయితే హరిహర వీరమల్లు గ్లింప్స్ కూడా యాడ్ చేస్తారని తెలిసింది.

మరి ఇప్పుడు అయితే ఇది అధికారికంగా వెల్లడి అయ్యిపోయింది. అయితే ఈ ఖుషి సినిమాని యూఎస్ మార్కెట్ లో కూడా రిలీజ్ చేస్తుండగా అక్కడ ప్రైమ్ మీడియా వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

మరి ఖుషి సినిమాని తామే రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసి హరిహర వీరమల్లు సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

దీనితో ఈ క్రేజీ అప్డేట్ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ లో మంచి ఆసక్తి రేపింది. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

అలాగే మెగాసూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం అందిస్తున్నారు.