ఏపీ సీఎం వైఎస్ జగన్ పై గత కొన్నిరోజులుగా విమర్శలు పేలుతున్నాయి.
టీడీపీ, జనసేన నేతలు జగన్ పై వరుసగా విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. జనసేన నేత పృథ్వీ సీఎం జగన్ కు మానవత్వం లేదని కామెంట్లు చేశారు.
ఏటీఎం సినిమాలో జగన్ అనే పాత్రను పోషించిన పృథ్వీ తనపై తాను సెటైర్లు వేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.
సీఎం జగన్ రాష్ట్రంలో తనను నమ్ముకున్న ఎవరికీ అన్యాయం చేయడం లేదు.తనను నమ్ముకున్న సినీ నటులకు పదవులు ఇచ్చి రుణం తీర్చుకున్నారు.
పృథ్వీ తప్పు చేశాడని అందువల్ల పదవి పోయిందని పృథ్వీ జగన్ ను నిందించడం కరెక్ట్ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సీఎంగా జగన్ ఎన్నో మంచి పథకాలను అమలు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పథకాలను అమలు చేయాలని ఆయన భావిస్తున్నారు.
పృథ్వీ కామెంట్లపై వైసీపీ నేతలు ఏమంటారో తెలియాల్సి ఉంది. జగన్ పై పృథ్వీకి ఇంత పగేంటి అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
పృథ్వీని చేర్చుకుని జనసేన తప్పు చేస్తోందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
గతంతో పోల్చి చూస్తే పృథ్వీకి సినిమా ఆఫర్లు అయితే పెరిగాయి. పృథ్వీ మాత్రం రాజకీయాలలో కూడా సత్తా చాటాలని అనుకుంటున్నారు.
పృథ్వీ నటుడిగానే కెరీర్ ను కొనసాగిస్తే బాగుంటుందని కొంతమంది సూచిస్తుండటం గమనార్హం.
పృథ్వీ జగన్ పై విమర్శలు చేసి తన స్థాయిని తగ్గించుకోవద్దని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.
సీఎం జగన్ కు మానవత్వం లేదా.. పృథ్వీ కామెంట్లపై వైసీపీ నేతలు ఏమంటారో?