మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు మెగా అభిమానుంతా పండుగ చేసుకుంటుంటారు. అయితే ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం భోళా శంకర్ గురించి అందరికీ తెలిసిందే.
తెలుగుతో పాటు హిందీ కూడా ఈ చిత్రం విడుదల కాబోతుంది. అయితే ఇందులో హీరోయిన్ గా చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్నారు.
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్లు బయటకు వచ్చాయి.
అవేంటంటే… ఈ చిత్రంలో చూడాలని ఉంది సినిమాలోని రామ్మా చిలకమ్మ పాను రిమిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ హీరోగా నటించి సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన ఖుషీ చిత్రంలోని ఫన్నీ సీన్స్ కూడా ఉంటాయని సమాచారం.
అయితే పవన్ కల్యామ్ నడుము చూసే సీన్ కూడా ఉంటుందని అంతా అనుకుంటున్నారు. భూమిక పాత్రలో శ్రీముఖి కనిపించనుండగా… పవన్ కల్యాణ్ పాత్రలో చిరంజీవి కనిపించనున్నారట.
అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రఘుబాబు, మురళీ శర్మ, రావు రమేష్, వెన్నెల కిషోర్, ప్రగతి..
తదితరులు ఈ చిత్రంలో నటించబోతున్నారు. అయితే ఈ సినిమా చిరంజీవి నటించబోతున్న 154 వ సినిమా. అలాగే ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను మహాశివరాత్రి సందర్భంగా గతేడాది మార్చి ఒకటో తేదీన వైబ్ ఆఫ్ భోళా పేరుతో చిత్ర బృందం విడుదల చేసింది.
అన్నా చెల్లెలి అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. తమిళంలో వేదాళం సినిమా సూపర్ హిట్టు కొట్టింది.ఈ చిత్రాన్ని ఎప్పటి నుంచో రీమేక్ చేయాలని ప్రయత్నించగా..
ఇప్పటికి కుదిరింది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో పడింది. ఈ సినిమా షూటింగ్ మధ్యలో నత్త నడకగా సాగింది. దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ చిత్రం ఎప్పుడు రీలీజ్ అవుతుందో ఎవరికీ తెలియదు.