మెగాస్టార్ చిరంజీవికి చాలా చాలా కోపమొచ్చేసిందట. ‘ఎవరెవరో ఏవేవో అంటారు. నా మీదా, నా కుటుంబ సభ్యుల మీదా దుష్ప్రచారం చేస్తారు.
వారికి నేనంత స్పేస్ ఇవ్వను నా జీవితంలో..’ అని ఈ మధ్యనే చిరంజీవి, ఓ టాక్ షోలో (‘నిజం’ పేరుతో సింగర్ స్మిత చేస్తోన్న షో) చెప్పారు. కానీ, చిరంజీవి సున్నిత మనస్కుడు.
తన కుమారుడు రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో దక్కించుకుంటున్న ప్రశంసల పట్ల సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
జేమ్స్ కేమరూన్, చరణ్‌ని అభినందించిన దరిమిలా ట్వీటేశారు చిరంజీవి.ఆ ట్వీటుపై పెద్ద దుమారం రేగింది.
ఈ వ్యవహారంపై చిరంజీవి చాలా అప్‌సెట్ అయ్యారట. అత్యంత సన్నిహితుల వద్ద ఈ విషయమై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారట.
‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి సోకాల్డ్ వెబ్‌సైట్లు నెగెటివ్ రివ్యూలు ఇవ్వడంపై చిరంజీవి సెటైరేసేసరికి,
ఆ వెబ్‌సైట్లు ఇలా చింరజీవిపై రివెంజ్ తీర్చుకున్నాయన్నది ఓ వాదన. తనను విమర్శించేవారికి ‘స్పేస్’ ఇవ్వను..
అని చెబుతూనే, చిరంజీవి ఎందుకు ఆ స్పేస్ ఇస్తున్నారట.? అదే చిరంజీవి సున్నిత మనస్తత్వంతో వచ్చిన సమస్య.