సెల్ఫీ పిచ్చితో అడ్డంగా దొరికేస్తున్న చినబాబు!

 యువగళం పాదయాత్రలో చినబాబు చేస్తున్న చిత్రాలు అన్నీ ఇన్నీ కాదు! తనదైన వాక్ చాతుర్యంతో ప్రత్యర్థులకు కావాల్సినన్ని అవకాశాలు..

 ట్రోలర్స్ కి కావాల్సినంత కంటెంటూ ఇస్తూ.. ముందుకు దూసుకుపోతున్నారు! ఈ క్రమంలో సెల్ఫీ సెల్ఫీ అంటూ చినబాబు చేస్తున్న పనులు.. అధికారపార్టీకి అవకాశాలిస్తున్నాయి!

 అవును… పాదయాత్ర పొడవునా కనిపించిన కంపెనీలు – ఆఫీసుల ముందు సెల్ఫీలు తీసుకుంటూ, ఇవన్నీ మా నాన్నగారే చేసాదు అని మురిసిపోతూ..

 ధమ్ముంటే జగన్ ని కూడా తనలా సెల్ఫీలు పెట్టండని ఛాలెంజ్ లు చేస్తూ ముందుకుపోతున్నాడు! ఈ ఉత్సాహంలో భాగంగా..

 ఓ టాప్ ప్రైవేటు విద్యాసంస్థ ముందు సెల్ఫీ పెట్టి, ఎదురుదెబ్బ తిన్నారు చినబాబు! చంద్రగిరి మండలంలోని ఒక ప్రైవేటు స్కూలు బోర్డు ముందు సెల్ఫీ తీసుకున్న చినబాబు…

 ఆ స్కూలు ఏర్పాటుకు తామే కారణమని, ఆ స్కూలు కోసం తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎనిమిది ఎకరాల భూమి ఇచ్చామని చెప్పుకొచ్చాడు. దీంతో…

 ఇలాంటి ప్రైవేటు వ్యక్తులకు, బడా వ్యాపార సంస్థలకు ప్రభుత్వ భూములు దారాదత్తం చేశారాన్న మాట అంటూ సెటైర్లు పడిపోతున్నాయి!

 ఎందుకంటే… టీడీపీ ప్రభుత్వం 8ఎకారాల భూమిని ఇచ్చామని చెప్పుకుంటున్నది ఒక ప్రైవేటు విద్యా సంస్థకి. అంటే… లక్షల్లో ఫీజులు కట్టించుకునే స్కూలుకి!

 దీనివల్ల సామాన్యులకు ఏమిటి ఉపయోగం! ఎల్.కే.జీ – యూ.కే.జీ లకే సుమారు లక్షన్నర రూపాయలు కట్టాల్సిన విద్యాసంస్థతో ఎవరికి ఉపయోగం?

 అంటూ ఆన్ లైన్ వేదికగా చినబాబును ఆడెసుకుంటున్నారు నెటిజన్లు! జగన్ సర్కారేమో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పెడితే వ్యతిరేకిస్తున్నది…

 ఇలాంటి ప్రైవేటు స్కూళ్లను ఎంకరేజ్ చేయడానికా అంటూ ప్రశ్నితున్న ఏపీవాసులు.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు

 ప్రభుత్వ భూములు ఎలాంటి వారికి పంచిపెట్టేశారన్న విషయంపై మరింత స్పష్టత వచ్చిందని కామెంట్ చేస్తున్నారు!