మొదటి సినిమాతో స్టార్ డైరెక్టర్, స్టార్ హీరోయిన్ తో ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. బెల్లంకొండ సురేశ్ తనయుడు సాయి శ్రీనివాస్ అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఆ సినిమాలో బెల్లం కొండకు జోడీగా సమంత నటించింది. వీ వీ వినాయక్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించినప్పటికీ… అంతగా సక్సెస్ కాలేకపోయింది.
అయితే ఆ తర్వాత పలు సినిమాలు చేసినపప్పటికీ ఈ హీరోకు మంచి హిట్ అయితే పడలేదు. ఇక త్వరలో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు
ఈ కుర్ర హీరో.తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో
సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ కాంబినేషన్‌లో ఛత్రపతి బాలీవుడ్ రీమేక్ రూపొందుతోన్న విషయం తెలిసిందే.
శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ నిర్మాత ధవల్ జయంతిలాల్ గడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలోని పాత్ర కోసం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఫిజికల్ గా అద్భుతంగా ట్రాన్సార్మ్ అయ్యారనే తెలుస్తోంది. ఆ లుక్ ను త్వరలో ప్రేక్షకులు చూడబోతున్నారు. టు నాటు’.. చరిత్ర సృష్టించాం అంటూ పోస్టు!
సాంకేతిక నిపుణులు వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలో సాహిల్ వాయిడ్, అమిత్ నాయర్, రాజేంద్ర గుప్తా, శివమ్ పాటిల్, స్వప్నిల్, ఆశిష్ సింగ్, మహమ్మద్ మొనజిర్, ఆరోషిక దేయ్, వేదిక, జాసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
అయితే ఈ సినిమా గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. చత్రపతి సినిమా ఓన్లీ ఓటీటీ కోసమే తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయరు అనే వార్త బయట హల్ చల్ చేస్తోంది.
ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే దాక ఆగాల్సిందే. ఇక బెల్లం కొండ శ్రీనివాస్ పవన్ డైరెక్టర్ సాగర్ చంద్రతో ఓ మూవీ చేస్తున్నట్లు సమాచారం.