ప్రభాస్‌తో చరణ్, ఎన్టీయార్, మహేష్‘సంక్రాంతి’ పోటీ.!

 వచ్చే సంక్రాంతికి రాబోయే సినిమాల గురించి టాలీవుడ్‌లో అప్పుడే పెద్ద రచ్చ నడుస్తోంది.

 ‘ప్రాజెక్ట్-కె’ సంక్రాంతికి వస్తుందనే ప్రకటన రావడంతోనే ఈ రచ్చ షురూ అయ్యింది.

 చరణ్ – శంకర్ కాంబో మూవీ సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నారు.

 మహేష్ – త్రివిక్రమ్ సినిమా కూడా సంక్రాంతికే షెడ్యూల్ అవ్వొచ్చు. ఎన్టీయార్ – కొరటాల శివ సినిమాదీ అదే పరిస్థితి అట.

 వామ్మో.. ఇదెక్కడి పంచాయితీ.? ఆయా చిత్రాల నిర్మాతలంతా ఈ వ్యవహారంపై మల్లగుల్లాలు పడుతున్నారట. మధ్యలో పవన్ కళ్యాణ్ సినిమా,

 బాలకృష్ణ సినిమా కూడా రేసులోకి రావొచ్చు.

 చిరంజీవి కూడా సంక్రాంతి రిలీజ్ ఖచ్చితంగా వుంటుందని అంటున్నారట.

 ఒక్కటే సంక్రాంతి.. అరడజనుకు పైగా భారీ చిత్రాలు.. ఏంటీ పరిస్థితి.? సంక్రాంతి తప్ప.. ఇంకో సీజన్ వీళ్ళెవరికీ కనిపించడంలేదా.?