గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు ఓ భారీ సినిమా షూటింగ్ చేస్తున్నాడు
అలాగే మరో పక్క పవన్ తన జనసేన పార్టీ పనులు కూడా ఏకకాలంలో చూసుకుంటూ బిజీ బిజీ లైఫ్ సాగిస్తున్నారు.
అయితే తన ఇంటి నుంచి రాజకీయాల పరంగా గత ఎన్నికల్లో చాలా మంది హీరోలు సపోర్ట్ గా నిలిచి ప్రచారం కూడా చేసారు.
అయితే అందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉండగా తాను ఇంకా రాజకీయాలు పరంగా పవన్ వెంటే ఉన్నాడా అంటే దానికి క్లారిటీ వచ్చిందని చెప్పాలి.
లేటెస్ట్ గా రామ్ చరణ్ నటించిన భారీ హిట్ చిత్రం త్రిబుల్ ఆర్(RRR) నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్స్ లో బెస్ట్ సాంగ్ గా అంతర్జాతీయ అవార్డు గెలుచుకోగా..
చిత్ర యూనిట్ అందరిని అభినందిస్తూ పవన్ కళ్యాణ్ ఎప్పటిలానే తన జనసేన సోషల్ మీడియా విభాగం నుంచి అధికారిక ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు.
అయితే ఇందులో చాలా మంది పవన్ కళ్యాణ్ కి మాత్రమే థాంక్స్ చెప్పారు
కానీ చరణ్ మాత్రం పవన్ కళ్యాణ్ తో పాటుగా రిప్లై లో జనసేన పార్టీ కి కూడా ధన్యవాదాలు కలిపి చెప్పడం అనేది మెగా ఫ్యాన్స్ లో ఆసక్తిగా మారింది.
దీనితో చరణ్ ఇప్పటికీ కూడా బాబాయ్ జనసేన వెంటే ఉన్నాడు అనే పాజిటివ్ సంకేతం అయితే బయటకి వచ్చింది.
కాగా ఇప్పుడు ఈ రిప్లై మంచి వైరల్ గా మారిపోయింది.