చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈరోజు కలుస్తున్నారు. ఇద్దరు ప్రముఖ నేతలు కలుస్తుండటం సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ అవుతోంది.
చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తే ఈ ఇద్దరు అధినేతల పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఏపీ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేయనున్నాయని సమాచారం అందుతోంది.ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం దిశగా అడుగులు పడుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో అమలవుతున్న జీవో గురించి కూడా చంద్రబాబు, పవన్ మధ్య చర్చ జరగనుందని బోగట్టా. సీఎం పదవి ఆఫర్ చేస్తే పొత్తుకు సిద్ధమేనని పవన్ కళ్యాణ్ చెప్పారని సమాచారం అందుతోంది.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అతి త్వరలో టీడీపీ, జనసేన నుంచి కీలక ప్రకటన అయితే రానుంది.
జగన్ తన జీవోలతో ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నాడని కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జగన్ ఎంత వివరణ ఇస్తున్నా ప్రతిపక్ష పార్టీలు మాత్రం జగన్ చెప్పే మాటలను అస్సలు నమ్మడం లేదు.
టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే మాత్రం జగన్ కు మరింత టెన్షన్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ పొత్తు వ్లల్ల వైసీపీకి సీట్లు తగ్గే అవకాశం అయితే ఉంది.
వైసీపీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు వల్లే లాభం జరుగుతుందని భావిస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ ఏపీకి సీఎం అవుతారా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మాత్రం మరి కొంతకాలం ఎదురుచూపులు అయితే తప్పవనే చెప్పాలి.