పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీకి నీతులు చెబుతున్న చంద్రబాబు.!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎంతటి ఉత్తముడో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకి బాగా తెలుసు.

సరే, రాజకీయాలన్నాక విమర్శలు మామూలే కావొచ్చు. రాజకీయ పార్టీలు పొత్తుల గురించి ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడటమూ వింత కాకపోవచ్చు.

గతంలో పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు విమర్శలు చేశారు. ఇప్పుడేమో, పవన్ కళ్యాణ్ మీద వైసీపీ విమర్శలు చేయడాన్ని తప్పు పడుతున్నారు.

బాబోరి నీతులు తెలుగుదేశం పార్టీ నేతలకే నచ్చడంలేదాయె.! 2014 ఎన్నికల సమయంలో టీడీపీకి జనసేన మద్దతిచ్చింది.

2019 ఎన్నికలకు వచ్చేసరికి జనసేన మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది టీడీపీ. ఆ టీడీపీ మీద జనసేన కూడా విమర్శలు చేయడం చూశాం.

పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసే క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అప్పట్లో జనసైనికుల్ని ఉద్దేశించి ‘అలగాజనం’ అని కూడా అన్నారు.

మరి, అప్పట్లో చంద్రబాబు ఎందుకు తన బావమరిది బాలయ్య నోటికి తాళం వేయలేకపోయారు.?

నీతులు ఎదుటోడికి చెప్పడానికే తప్ప, తాను పాటించడానికి కాదన్నది చంద్రబాబు రాజకీయ సిద్ధాంతం. దాన్నే పచ్చ సిద్ధాంతం.. అని కూడా చెప్పుకోవచ్చు.

వైసీపీ చేసే విమర్శలకు కౌంటర్ ఎటాక్ ఇచ్చుకునే శక్తి జనసేనకు వుంది. జనసేనకు వత్తాసు పలికే క్రమంలో వైసీపీకి చంద్రబాబు సుద్దులు చెప్పడమేంటి.?

ఇక్కడ రాజకీయంగా ఎవరూ పతివ్రత కాదు. టీడీపీ అస్సలు మాట్లాడకూడదు పాతివ్రత్యం గురించి.