జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి చంద్రబాబే దర్శకుడు, నిర్మాత అని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
పవన్ కళ్యాణ్ పేరుని నేరుగా ప్రస్తావించకుండానే పవన్ కళ్యాణ్ మీద ప్రతిసారీ విమర్శలు చేస్తూ వస్తున్నారు.. అధికారిక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
దత్త పుత్రుడంటూ పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ర్యాగింగ్ చేస్తోంటే, ‘జైలు పుత్రుడు, చెత్త పుత్రుడు’ అంటూ జనసేన కూడా ఎదురుదాడికి దిగుతోంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైన.
‘ఒకాయన పధ్నాలుగేళ్ళయ్యింది రాజకీయాల్లోకి వచ్చి. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఆయన్ని ప్రజలు ఓడించారు. ఆయన అప్పుడప్పుడూ రాజకీయాలు చేస్తాడు.
చంద్రబాబు ఆడించినట్టల్లా ఆడతాడు. ఆయనకి చంద్రబాబే దర్శకుడు, నిర్మాత..’ అంటూ తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ అధికారిక కార్యక్రమంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ వ్యవహారం మీద కూడా సెటైర్లేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు బహిరంగ సభ కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోవడంపై తీవ్రంగా స్పందించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
చంద్రబాబు మీద విమర్శల సంగతేమోగానీ, పవన్ కళ్యాణ్‌ని ర్యాగింగ్ చేయడం మీద ప్రత్యేక శ్రద్ధని ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కనబరుస్తున్నట్లే కనిపిస్తోంది. కానీ, దాని వల్ల లాభమేంటి.?
ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదువుకోవడం తప్ప, అధికారిక వేదికలపైనా.. ఆ స్క్రిప్టు లేకుండా మాట్లాడలేని వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి..
ఇద రాష్ట్ర ప్రజల ఖర్మ.. అంటూ జనసేన పార్టీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కౌంటర్ ఎటాక్ చేస్తోంది.