“నాటు నాటు” ని సీరియస్ గా తీసుకున్న సెంట్రల్.?

 ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాత అవార్డు అయినటువంటి ఆస్కార్ విషయంలో మన దేశం ప్రజలు చాలా ఎమోషనల్ గా అయితే ఎదురు చూస్తున్నారు.

 ఓ సినిమా మరియు డాక్యూమెంటరీ సహా మన తెలుగు నుంచి మొట్ట మొదటి ఎంట్రీ గా ఆర్ ఆర్ ఆర్ సినిమా నుంచి నాటు నాటు సాంగ్ అయితే నిలిచింది.

 మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన ఈ సినిమాని దర్శకుడు రాజమౌళి తెరకెక్కించగా

 ఆలియా భట్ మరియు ఒలీవియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించారు.

 కాగా మిగతా రెండు ఏమో కానీ ఖచ్చితంగా అయితే ఈ సినిమా నుంచి నామినేట్ అయ్యిన నాటు నాటు సాంగ్ తప్పకుండా ఆస్కార్ ని తీసుకొస్తుంది

 అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ పాట విషయంలో అయితే చిత్ర యూనిట్ మాత్రమే కాకుండా

 దేశ కేంద్ర ప్రభుత్వం కూడా కాస్త సీరియస్ గానే తీసుకున్నట్టుగా అనిపిస్తుందని చెప్పుకోవాలి. కాగా కొన్ని రోజులు కితమే ఏకంగా మోడీ ఈ సాంగ్ పై స్పందించడం

 అలాగే నిన్ననే దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మికులు సద్గురు కూడా స్పందించడం అనేది ఒక్క నేషనల్ వైడ్ గానే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా ప్రభావం చూపించే అంశం.

 దీనితో అయితే నాటు నాటు విషయంలో సెంట్రల్ నుంచి తమ వంతు సపోర్ట్ ని ఇలా అందిస్తున్నట్టుగా అనిపిస్తుందని చెప్పుకోవాలి.

 మరి ఈ సినిమాకి తెలుగు ఇండస్ట్రీ కి ఇండియన్ సినిమాకి ఆస్కార్ ని తీసుకురావడంలో ఎంత మేర హెల్ప్ చేస్తుందో చూడాలి.