ఈ విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవచ్చా… పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

 మన ఇంట్లో అందంగా ఉండడం కోసం ఎన్నో రకాల వస్తువులను ఇంట్లో అలంకరణ వస్తువులుగా పెట్టుకుంటూ ఉంటాం అయితే ఇలాంటి వస్తువులలో

 చాలామంది ఏనుగు బొమ్మలను కూడా ఇంట్లో అలంకరణ వస్తువులుగా ఉపయోగిస్తూ ఉంటారు.మరి వాస్తు శాస్త్రం ప్రకారం ఏనుగు బొమ్మలను ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోవడం వల్ల

 ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయంలో చాలామంది సంతోషం వ్యక్తం చేస్తుంటారు. ఏనుగు బొమ్మలు వాస్తు పరంగా మన ఇంటికి ఎన్నో శుభ ఫలితాలను కలిగిస్తాయి.

 ముఖ్యంగా ఏనుగు విగ్రహాలను వాస్తు ప్రకారం ఇంటిలో కనుక అలంకరిస్తే మన ఇంటిపై ఏ విధమైనటువంటి చెడు ప్రభావం పడదని నిపుణులు చెబుతున్నారు.

 సాధారణంగా ఏనుగు ఎంతో బలమైన జంతువు కనుక శక్తికి బలానికి ప్రతీకగా భావిస్తారు. అలాగే విగ్నేశ్వరుడి తల ఏనుగు తలను పోలి ఉండడంతో

 ఏనుగుకు మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది.ఇక ఏనుగు విగ్రహం మన ఇంటిలో కనుక ఉంటే మన ఇంటిపై ఎలాంటి నెగటివ్ ప్రభావం లేకుండా

 మన ఇంటి పై ఎల్లప్పుడూ అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఏనుగు బొమ్మలలో పైకి ఎత్తుకొని ఉన్నటువంటి ఏనుగు విగ్రహాలను

 ఇంటి ప్రధాన ద్వారం ముందు పెట్టడం ఎంతో మంచిది. ఇక ఇంట్లో కూడా ఏనుగు విగ్రహాలను అలంకరించుకునేవారు ఇంటికి ఉత్తర దిశలో పెట్టడం వల్ల

 అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఇక వ్యాపారంలో ఎలాంటి నష్టాలు లేకుండా వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందుతుంది.

 ఇక ఏనుగు సాక్షాత్తు విగ్నేశ్వరుడిని సూచిస్తుంది కనుక మనం ఇంట్లో ఎలాంటి కార్యాలు చేసినా ఆ కార్యక్రమాలు ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు కొనసాగుతాయి.

 చాలామంది ఏనుగు బొమ్మల సుభ సూచకమని వెండి విగ్రహాలను పెట్టుకుంటారు అయితే ఆర్థిక స్తోమతను బట్టి మనం ఏనుగు విగ్రహాలను ఇంట్లో అలంకరించుకోవచ్చు.