ఈసారి బిగ్ క్లారిటీతో “ఆదిపురుష్” మేకర్స్ ని నమ్మొచ్చా.!

పాన్ ఇండియా మార్కెట్ లో భారీ అంచనాలు ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి

కాగా అన్నీ పర్ఫెక్ట్ గా ఉండి ఉంటే ఈ పాటికే ఈ చిత్రం థియేటర్స్ లో రన్ అయ్యేది. మరి ఈ సినిమా రిలీజ్ సంక్రాంతి నుంచి ఎందుకు ఆగిందో కూడా అందరికీ తెలిసిందే.

సినిమాలో కార్టూన్ లాంటి గ్రాఫిక్స్ పెట్టి దీనిని 500 కోట్ల బడ్జెట్ సినిమాగా ప్రెజెంట్ చెయ్యడం ఆడియెన్స్ లో నవ్వు తెప్పించింది. దీనితో దెబ్బకి జూన్ కి సినిమాని వాయిదా వేశారు.

అయితే తర్వాత అప్పుడు కూడా సినిమా అదే సమయానికి వస్తుందని ఎవరూ అంత నమ్మలేదు

కానీ లేటెస్ట్ గా మాత్రం చిత్ర యూనిట్ సినిమా రిలీజ్ కి ఇంకా 150 రోజులు మాత్రమే ఉందంటూ పోస్ట్ చేయడం ఆసక్తిగా మారింది.

దీనితో ఆదిపురుష్ రిలీజ్ పై ఓ క్లారిటీ వచ్చింది. మరి ఈ చిత్రం విషయంలో ఈసారి నమ్మేలా ఉందని చెప్పాలి. ఆల్రెడీ సినిమా సినిమాటోగ్రాఫర్ కూడా ఇటీవలే అప్డేట్ అందించాడు.

మరి అలా ఈసారి రిలీజ్ మాత్రం అనుకున్న సమయానికే వస్తుందని చెప్పొచ్చు.

ఇక ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ఇప్పుడుకి అయినా కూడా బాగా  వచ్చాయో లేదో చూడాలి.

మరి ఈ సినిమాని దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించగా కృతి సనన్ జానకి దేవిగా సైఫ్ ఆలీ ఖాన్ రావణ పాత్రలో నటించారు. మరి వరల్డ్ వైడ్ అయితే ఈ సినిమా జూన్ 16న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.