గర్భంతో ఉన్న మహిళలు ఓ ఆర్ ఎస్ తాగవచ్చా… తాగడం వల్ల ఏం జరుగుతుంది?

సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు వారి ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా వారు తీసుకునే ఆహార పదార్థాల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

గర్భంలో మరో శిశువు ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాలు తప్పనిసరిగా గర్భవతి తమ ఆహార పదార్థాలలో భాగంగా తీసుకోవాలి అప్పుడే తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు.

ఇక గర్భం దాల్చిన మహిళలలో కూడా ఎన్నో మార్పులు సంభవిస్తాయి మొదటి 5 నెలల వరకు చాలామందిలో వాంతులు తలనొప్పి వంటి సమస్యలు వెంటాడుతూ ఉంటాయి.

ఇలా గర్భం దాల్చిన మహిళలకు వాంతులు వికారంగా ఉన్నట్లయితే చాలామంది ఓఆర్ఎస్ తాగమని సలహాలు ఇస్తుంటారు అయితే నిజంగానే గర్భం దాల్చిన మహిళలు ఓ ఆర్ ఎస్ తాగవచ్చా?

ఓ ఆర్ ఎస్ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవా ఈ విషయం గురించి వైద్యులు ఏం చెబుతున్నారు అనే విషయానికి వస్తే…

సాధారణంగా గర్భం దాల్చిన మహిళలలో వాంతులు రావడం సర్వసాధారణం అయితే తరచూ వాంతులు అవుతున్న కారణంగా చాలామంది నీరసంగా డిహైడ్రేషన్ కి గురవుతారు.

ఇలా డిహైడ్రేషన్ కి గురి కావడం వల్ల మరింత ప్రమాదకరంగా మారే పరిస్థితిలో ఉంటాయి

కనుక ఎలాంటి సంకోచాలు లేకుండా గర్భవతులకు ఓఆర్ఎస్ తాపించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఇలా ఓఆర్ఎస్ తాగటం వల్ల గర్భవతులలో డిహైడ్రేషన్ సమస్య నుంచి భారీ పడటమే కాకుండా వాంతులు కూడా కొంతమేర తగ్గుతాయి.

అంతేకాకుండా గర్భం దాల్చిన మహిళలలో కొంతమేర శక్తిని కూడా అందిస్తుంది.

అయితే గర్భవతులకు ఓఆర్ఎస్ తాగడం మంచిది కదా అని శృతిమించు తాగటం వల్ల దగ్గు జలుబు వంటి సమస్యలు వచ్చే పరిస్థితులు తలెత్తుతాయి

కనుక అవసరానికి మించి మాత్రమే ఓఆర్ఎస్ తాగాలి వీటితో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డకు బలం చేకూరే ఆహార పదార్థాలను కూడా తీసుకోవాలి.