శీతాకాలంలో సమృద్ధిగా లభించే చిక్కుడుకాయ మరియు చిక్కుడు గింజల్లో మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన ప్రోటీన్స్, విటమిన్స్,
ఫైబర్ కార్బోహైడ్రేట్స్,మినరల్స్, అమైనో ఆమ్లాల అధిక మొత్తంలో లభ్యమవుతాయి. కావున మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా కూడా చిక్కుడు కాయలను ఆహారంగా తీసుకోవచ్చు.
చిక్కుడు కాయల్లో లభించే అత్యధిక ప్రోటీన్స్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు శారీరక మానసిక, దృఢత్వాన్ని పెంపొందిస్తాయి.
చిక్కుడుకాయలను రోజువారి మన డైట్ లో ఉపయోగిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చిక్కుడుకాయల్లో అత్యధికంగా ప్రోటీన్స్, ఫైబర్ లభిస్తుంది కావున రోజువారి కార్యకలాపాలకు అవసరమైన శక్తి నిలువలు సమృద్ధిగా లభిస్తాయి.
జీర్ణ క్రియ మెరుగుపడి మలబద్ధకం గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తొలగిపోతాయి.చిక్కుడులో ఎక్కువగా ఉండే సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజ లవణాలు
ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచి శ్వాస వ్యవస్థను లోపాలను సరిచేస్తుంది. చిక్కుడు లో ఉండే పొటాషియం రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.
చిక్కుడు గింజల్లో సమృద్ధిగా లభించే అమైనో ఆమ్లాలు, యాంటీ ఇన్ఫ్లోవేటరీ గుణాలు శరీరంలో ఏర్పడి ఫ్రీ రాడికల్స్ ను నియంత్రించడమే కాకుండా
హార్మోన్ల పనితీరును మెరుగుపరిచి థైరాయిడ్, నిద్రలేమి సమస్య, సంతానలేని సమస్యలను దూరం చేస్తుంది.చిక్కుడు గింజల్లో పుష్కలంగా ఉన్న ఐరన్, కాపర్ రక్తహీనత సమస్యను తొలగిస్తుంది.
చిక్కుడుకాయలో సమృద్ధిగా లభించే విటమిన్ బి 1, మెగ్నీషియం మెదడు పనితీరును మెరుగుపరిచే ఎసిటైల్ కోలీన్ అనే న్యూరో ట్రాన్స్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది
మెదడు కండరాలను దృఢంగా ఉంచడమే కాకుండా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.