బిజీ శ్రీలీల.. మరో బిగ్ ఆఫర్ తో.!

టాలీవుడ్ లో ఓ కొత్త హీరోయిన్ వచ్చిందంటే ఆమె లక్ చాలా వరకు కూడా చాలా వరకు ఆమెని సక్సెస్ వైపు తీసుకెళ్తుంది.

 అలా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అయితే అనతి కాలంలోనే ఎన్నో ఆఫర్స్ సొంతం చేసుకున్న

 యంగ్ హీరోయిన్స్ లో ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ మంచి స్టార్డం ని అందుకుంది. కానీ ఇప్పుడు అయితే మరింత మంది ఈ లిస్ట్ లోకి వచ్చారు.

 ముందు అయితే కృతి శెట్టి రాగ ఈ యంగ్ హీరోయిన్ కూడా ఇప్పుడు ఆల్ మోస్ట్ ఫేడ్ అవుట్ లైన్ లోకి వచ్చేసింది.

 కానీ లేటెస్ట్ గా అయితే యంగ్ సెన్సేషన్ శ్రీ లీల కొత్తగా వచ్చింది.  కాగా ఈ యంగ్ హీరోయిన్ ఇప్పుడు ఏ హీరోయిన్ కూడా లేని అన్ని సినిమాల లైనప్ తో సిద్ధంగా ఉండగా..

 ఇప్పుడు అయితే మరో సినిమాని ఓకే చేసినట్టుగా తెలుస్తుంది. అది కూడా ఓ స్టార్ హీరోతో అన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

 మరి ఈ ప్రాజెక్ట్ అయితే యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో అని సినీ వర్గాలు చెప్తున్నాయి.

 కాగా విజయ్ నెక్స్ట్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

 ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనుండగా ఈ భారీ సినిమా ఆఫర్ ని అయితే శ్రీ లీల దక్కించుకున్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి.

 దీనితో అయితే ఈమె ఇప్పుడు టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కూడా లేనంత బిజీగా ఉందని చెప్పాలి. దాదాపు 10 కి మేర సినిమాలు ఇప్పుడు ఈమె చేతిలో ఉన్నాయి.