బాక్సాఫీస్ రిపోర్ట్ : “ధమాకా” 4డేస్ కంప్లీట్ కలెక్షన్ డీటెయిల్స్.!

టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ హీరో మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా “ధమాకా” ఇప్పుడు భారీ హిట్ అయ్యి ఈ ఏడాది ఎండింగ్ కి ఫైనల్ హిట్ లా కనిపిస్తుంది.

మరి తాను ఈ ఏడాది చేసిన రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. పైగా తన నిర్మాణం లో వచ్చిన మట్టి కుస్తీ అనే సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.

మరి ఫైనల్ గా మరో సినిమాతో వచ్చిన తాను సక్సెస్ అయ్యాడు. ధమాకా సినిమా మొదటి రోజే తన కెరీర్ లో ఓ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచి దుమ్ము లేపింది.

ఇక ఇప్పుడు మూడు రోజులకి చేరుకున్న ఈ సినిమా అయితే ఏకంగా 41 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా చిత్ర యూనిట్ తెలిపింది.

మరి దీని డీటెయిల్స్ చూసినట్టు అయితే యూఎస్ నుంచి ఈ చిత్రం గడిచిన 4 రోజుల్లో 2.7 కోట్ల గ్రాస్ ని ధమాకా అందుకోగా తెలుగు స్టేట్స్ లో అయితే 5.2 కోట్లకి పైగా గ్రాస్ ని నాలుగో రోజు అందుకోవడం విశేషం.

దీనితో అయితే ధమాకా టోటల్ గా మేకర్స్ చెప్పినట్టే 40 కోట్లకి పైగానే వసూళ్లు రాబట్టి రవితేజ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే సినిమాగా దూసుకెళ్తుంది.

ఈ సోమవారం కూడా ధమాకా వసూళ్లు లో డ్రాప్ కనిపించలేదు. దీనితో ఈ సినిమా డెఫినెట్ గా 50 కోట్ల మార్క్ చేరుతుంది అని ట్రేడ్ వర్గాల వారు అనుకుంటున్నారు

ఇక సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా భీమ్స్ అదిరే ఆల్బమ్ ని సినిమాకి ఇచ్చాడు.