లేటెస్ట్ బాలీవుడ్ బాక్సాఫీస్ బ్లాస్ట్ సినిమా “పఠాన్” విజయం ఒకసారిగా కొన ఊపిరితో ఉన్న బాలీవుడ్ కి ప్రాణం పోసింది.
దీనితో ఈ మాసివ్ బ్లాక్ బస్టర్ హిట్ హీరో షారుఖ్ ఖాన్ కెరీర్ లోనే ఓ బిగ్గెస్ట్ హిట్ గా నిలవగా బాలీవుడ్ లో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డులు నమోదు చేసింది.
ఇక ఇప్పుడు బాలీవుడ్ లో జస్ట్ బాహుబలి 2 వెనకే ఈ సినిమా ఉండగా ఎన్నో ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డుని బ్రేక్ చేస్తుంది అనే స్థాయికి వెళ్ళింది.
ఇక బి టౌన్ లో మాత్రమే ఈ సినిమా 475 కోట్ల సెన్సషనల్ గ్రాస్ ని అందుకోగా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఏకంగా 1000 కోట్ల వసూళ్ల దిశగా అయితే ఈ సినిమా దూసుకెళ్తుంది.
ఇక లేటెస్ట్ గా అయితే చిత్ర యూనిట్ సినిమా తాజా వరల్డ్ వైడ్ వసూళ్లను అనౌన్స్ చేశారు.
మరి ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా అయితే 953 కోట్ల మాసివ్ గ్రాస్ ని అందుకుందట.
ఇందులో ఒక్క ఓవర్సీస్ మార్కెట్ నుంచే 360 కోట్లు వసూలు అయ్యాయి. దీనితో ఈ భారీ హిట్ బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్ లో రన్ ని తీసుకెళ్తుంది.
కాగా ఈ సినిమా సక్సెస్ తో నెక్స్ట్ రానున్న షారుఖ్ సినిమాలపై మరింత క్రేజ్ నెలకొంది.
ఇంకా ఈ సినిమాకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు అలాగే దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించగా జాన్ అబ్రహం సాలిడ్ విలన్ రోల్ లో నటించాడు.
ఫైనల్ గా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అదిరిపోయే క్యామియో లో నటించాడు.