బాక్సాఫీస్ : వరల్డ్ వైడ్ భారీ మైలురాయికి దగ్గరలో “అవతార్ 2..కానీ!

పాన్ వరల్డ్ దగ్గర అవైటెడ్ సినిమా అయినటువంటి “అవతార్ 2” కోసం అందరికీ తెలిసిందే.

మరి ప్రపంచ వ్యాప్తంగా ఈ డిసెంబర్ 16న భారీ ఎత్తున రిలీజ్ అయ్యిన ఈ చిత్రం గట్టి ఓపెనింగ్స్ నే వరల్డ్ వైడ్ రాబట్టింది కానీ అనుకున్న రేంజ్ సెన్సేషనల్ ఓపెనింగ్ అయితే సినిమా అందుకోలేదు.

ఇక ఇదిలా ఉండగా మన దేశంలో కూడా ఈ సినిమా మాసివ్ ఓపెనింగ్స్ అందుకొని మొదటి వారం లోనే 200 కోట్ల గ్రాసింగ్ క్లబ్ లో అయితే ఈ సినిమా చేరింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా 2 బిలియన్ డాలర్స్ టార్గెట్ తో రిలీజ్ కాగా ఇప్పుడు అయితే అందులో ఎంత రాబట్టిందో ఇప్పుడు తెలుస్తుంది.

ఇక ట్రేడ్ వర్గాల లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రం సినిమాలో సగం టార్గెట్ కి వస్తున్నట్టు తెలుస్తుంది. అంటే 1 బిలియన్ మేర అందుకున్నట్టుగా తెలుస్తుంది.

ఇప్పుడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 885 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది అట. దీనితో మరో రెండు రోజుల్లో అలా 1 బిలియన్ ని అయితే ఈ చిత్రం అందుకుంటుంది.

ఇక లాంగ్ రన్ లో అయితే ఈ చిత్రం ఎంతవరకు వస్తుందో అని అంతా చూస్తున్నారు. కానీ ఈ చిత్రం ఇంకో 1 బిలియన్ రాబట్టాల్సి ఉంది.

మరి ఇది లాంగ్ రన్ లో సక్సెస్ అయ్యేనా లేదా అనేది మాత్రం ఇప్పుడు చాలా ప్రశ్నగా మారింది. మరి ప్రపంచ ఆడియెన్స్ ఏం చేస్తారో చూడాలి.