బాక్సాఫీస్ : “అవతార్ 2” ప్రపంచ వ్యాప్త మొదటి రోజు షాకింగ్ వసూళ్లు.?

ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రం “అవతార్ 2” ఎట్టకేలకు ఈరోజు వరల్డ్ వైడ్ 40 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీస్రిలీజ్ అయ్యింది.

మరి మన దేశంలో కూడా భారీ ఎత్తున రిలీజ్ అయ్యిన ఈ చిత్రం దాదాపు అంచనాలు అందుకునే రేంజ్ లో హైప్ తో రిలీజ్ అయ్యింది.

మరి కొన్ని ఇబ్బందులు లాస్ట్ మినిట్ లో తలెత్తినప్పటికీ ఇప్పుడు అయితే ఈ భారీ చిత్రం అనేక వెర్షన్స్ లో థియేటర్స్ లో ప్రదర్శితం అవుతుంది.

ఇక ఈ సినిమా రిలీజ్ హైప్ తో పాటుగా ఈ సినిమాకి నమోదు అయ్యే వసూళ్లు కోసం కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి వరల్డ్ వైడ్ అయితే అవతార్ 2 మొదటి ఈరోజు ఎంత వసూళ్లు అందుకుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది.

మరి ఈ చిత్రం అయితే వరల్డ్ వైడ్ ఫస్ట్ డే 500 మిలియన్ డాలర్స్ మేర వసూలు చేయనున్నట్టుగా తెలుస్తుంది.

దీనితో అయితే ఈ చిత్రం 4000 కోట్ల పై చిలు వసూళ్లు ఈ సినిమా మొదటి రోజుతో రాబట్టేసింది అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు.

అయితే ఇది ఒకింత నమ్మశక్యంగా లేదు కానీ అవతార్ 1 సినిమా బడ్జెట్ కి నాలుగింతలు ఒక్క రోజులో అందుకుంది.

దీనిని ఒక్క రోజులో రాబట్టేసిన ఈ చిత్రం ముందు రోజుల్లో ఎలాంటి సంచనాలు నమోదు చేస్తుందో చూడాలి.