బ్లాస్టింగ్ అప్డేట్ : “NTR30” రిలీజ్ డేట్ తో షాకిచ్చిన మేకర్స్.!

 ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ హైప్ తో పలు చిత్రాల్లో మన టాలీవుడ్ నుంచి రానున్న సినిమాలు కూడా చాలా ఉండగా

 ఈ చిత్రాల్లో అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సినిమా కూడా ఒకటి.

 మరి ఇప్పుడు ఈ సినిమా ఎన్టీఆర్ 30 గా పిలవబడుతూ ఉండగా ఈ సినిమాకి ముందు ఎన్టీఆర్ కి ఆర్ ఆర్ ఆర్ సినిమాతో భారీ క్రేజ్ రావడంతో

 కొరటాలకి ఆచార్య లాంటి ప్లాప్ ఉన్నప్పటికీ దీనిపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

 మరి దీనితో అయితే ఈ చిత్రం భారీ హైప్ తో కొనసాగుతూ ఉండగా ఇప్పుడు చిత్ర యూనిట్ సినిమా అధికారిక రిలీజ్ డేట్ ని లాక్ చేసి షాకిచ్చారు.

 ఈ చిత్రాన్ని అయితే చిత్ర యూనిట్ వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

 దీనితో ఈ బ్లాస్టింగ్ అప్డేట్ దెబ్బకి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుండగా షూటింగ్ పై కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

 ఈ షూట్ అయితే ఈ ఫిబ్రవరి నుంచే స్టార్ట్ చేయనున్నట్టు తెలిపారు. ఇక ఈ సినిమాకి అయితే హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యినట్టుగా సమాచారం ఉండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

 అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.