బిగ్గెస్ట్ అప్డేట్ : “ప్రాజెక్ట్ కే” రిలీజ్ మాసివ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.!

 ఇప్పుడు మన తెలుగు సినిమా ఒక్క పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా వరల్డ్ లెవెల్లో కూడా సత్తా చాటింది.

 మరి ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి తో భారీ క్రేజ్ సొంతం చేసుకొని తానే మొదటి పాన్ వరల్డ్ సినిమాని కూడా అనౌన్స్ చేసాడు.

 యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు సెట్ చేసుకొని ఉంది.

 అయితే ఈ మాసివ్ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు చిత్ర యూనిట్ ఓ ఊహించని బిగ్గెస్ట్ క్రేజీ అనౌన్సమెంట్ ని అందించారు.

 ఈ సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేస్తూ వచ్చే ఏడాది జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా ఓ క్రేజీ పోస్టర్ ని డిజైన్ చేసి విడుదల చేసారు.

 మరి ఇందులో ఓ భారీ చేయి ఆకారం పైగా దాని ముందు ఓ ముగ్గురు కనిపిస్తున్నారు.

 గన్స్ పట్టుకొని వారు ఉండగా ఆ బాక్గ్రౌండ్ అంతా కూడా ఆసక్తికర వాతావరణం కనిపిస్తుంది.

 దీనితో ఈ ఊహించని పోస్టర్ మరియు అప్డేట్ లు ఓ రేంజ్ లో ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర హాట్ టాపిక్ గా అయితే మారాయి.

 కాగా ఈ భారీ సినిమాలో దీపికా పదుకొనె అలాగే అమితాబ్ బచ్చన్ లు నటిస్తుండగా

 అశ్వని దత్ ఈ సినిమాని ప్రభాస్ పై నమ్మకంతో మినిమమ్ 500 కోట్లు బడ్జెట్ కేటాయించి నిర్మిస్తున్నారు.