బాలీవుడ్.. బాలీవుడ్ సినిమాలు అన్నా, హీరోహీరోయిన్లు ఇండియన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇక్కడ రిలీజ్ అయిన ఏ సినిమాను అయినా దాదాపు అందరూ చూస్తుంటారు.
ప్రాంతీయతతో సంబంధం లేకుండా సినిమాలను వీక్షిస్తుంటారు. హీరోహీరోయిన్లను కూడా విపరీతంగా అభిమానిస్తుంటారు.
అయితే బాలీవుడ్ లో రిలీజ్ అయిన చిత్రాలు మొదటి వారంలో బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబట్టి టాప్ 5 లో నిలిచిన సినిమాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది.
నాలుగేళ్ల గ్యాప్ తర్వాత షారుఖ్ నటించిన సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది.
జాన్ అబ్రహం, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా వారం రోజుల్లోనే 351 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. అలాగే 9 రోజుల్లోనే సౌత్ ఇండియా నుంచి 80.31 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ముందు ముందు కూడా భారీ కలెక్షన్లను రాబట్టే అనేక రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్ 2 కూడా భారీ వసూళ్లను సాధించి రికార్డు క్రియేట్ చేసింది.
హిందీ వెర్షన్ లో వారం రోజుల్లోనే 268.63 కోట్లు రాబట్టింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి2 కూడా బాలీవుడ్ లో బాగానే వసూళ్లు సాధించింది.
స్టార్ హీరోహీరోయిన్లు ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నా కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం వారం రోజుల్లోనే 247 కోట్ల రాబట్టింది.
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, అనుష్క శర్మ హీరోహీరోయిన్లుగా వచ్చిన సుల్తాన్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.
బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసింది. 229.16 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది.
తొలి వారం అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా చరిత్రకెక్కింది. కానీ ఈ సినిమా తర్వాత కేజీఎఫ్, బాహుబలి2, పఠాన్ చిత్రాలు రికార్డును బ్రేక్ చేస్తూ వెళ్లాయి.