కోలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోస్ లో సీనియర్ స్టార్ హీరో విజయ్ కూడా ఒకడు.
మరి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమానే “వారసుడు”. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తో విజయ్ మొదటిసారిగా వర్క్ చేయగా
ఈ సినిమా అనూహ్య విజయాన్ని తెలుగు మరియు తమిళ్ భాషలో నమోదు చేసింది.అంతే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ సి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సత్తా చాటగా
ఇప్పుడు అన్ని చోట్లా థియేట్రికల్ రన్ ని ముగించుకుంది. ఇక ఈ అవైటెడ్ సినిమా అయితే ఇప్పుడు ఓటిటి లో సందడి చేసందుకు సిద్ధం అయ్యింది.
గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం చాలా మంది ఆసక్తిగా ఉండగా.. మొత్తానికి ఈ బిగ్ అప్డేట్ దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ రివీల్ చేశారు.
ఈ సినిమా తెలుగు వెర్షన్ “వారసుడు” అలాగే తమిళ్ వెర్షన్ “వారిసు” మాత్రమే కాకుండా అదనంగా మరో భాష మలయాళంలో కూడా ఈ సినిమాని ప్రైమ్ వీడియో సంస్థ
ఈ ఫిబ్రవరి 22 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకురాబోతున్నట్టుగా ఆ బిగ్ అప్డేట్ ని ఇప్పుడు అందించారు.ఇక ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించింది.
అలాగే శ్రీకాంత్, ఎస్ జె సూర్య, జయసుధ లాంటి బిగ్ స్టార్స్ కూడా నటించారు. అలాగే థమన్ ఎస్ సంగీతం సమకూర్చాడు.