బిగ్ క్లారిటీ : షారుఖ్ సినిమాలో అల్లు అర్జున్ ఉన్నాడా లేడా.?

 ప్రస్తుతం ఇండియన్ సినిమా అంతా ఒకటే అయిపోయింది, ముఖ్యంగా అన్ని భాషల సినిమాల నటులు దర్శకులు కలిసి పని చేస్తూ పలు సాలిడ్ ప్రాజెక్ట్ లు అందిస్తుండడంతో

 అన్ని వర్గాల ఆడియెన్స్ లోకి అన్ని సినిమాల వారు వెళ్తున్నారు. అలా చేస్తున్న లేటెస్ట్ ఓ ఇంట్రెస్టింగ్ సినిమానే “జవాన్”.

 తమిళ దర్శకుడు అట్లీ బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన షారుఖ్ ఖాన్ తో చేస్తున్న సినిమా ఇది. షారుక్ ఇప్పుడు నటించిన “పఠాన్” ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.

 ఈ సినిమా తర్వాత వస్తున్న సినిమా జవాన్ కావడంతో దీనిపై నెక్స్ట్ లెవెల్ హైప్ ఏర్పడింది.

దీనితో ఈ సినిమా హైప్ భారీ ఎత్తున ఉండగా ఇక నెక్స్ట్ ఈ సినిమాలో మరో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కూడా ఓ సాలిడ్ గెస్ట్ రోల్ చేస్తున్నట్టుగా గట్టి గాసిప్స్ వినిపించాయి.

 కానీ ఇప్పుడు మాత్రం బాలీవుడ్ సినీ వర్గాల నుంచి అయితే ఈ సెన్సేషనల్ కలయిక ఆగిపోయినట్టుగా తెలుస్తుంది.

 అల్లు అర్జున్ కి ఇప్పుడు పుష్ప 2 కి ఉన్న టైట్ షెడ్యూల్ మూలాన జవాన్ సినిమాలో తాను నటించడం వీలు పడేలా లేదని ఇప్పుడు వారు చెప్తున్నారు.

 దీనితో ఈ అవైటెడ్ క్రేజీ కాంబినేషన్ ఉండకపోవచ్చనే టాక్ ఇప్పుడు విపరీతంగా వినిపిస్తుంది.

 దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ ని చూడాలి అనుకునే వారికి ఇప్పుడు నిరాశే ఎదురైంది అనిచెప్పుకోవాలి. మరి టైంసెట్టయ్యిమళ్ళీఏమన్నావర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

 కాగా ఈ సినిమాలో అయితే అల్లు అర్జున్ 10 నుంచి 20 నిమిషాల మేర రోల్ ని తాను డిజైన్ చేసినట్టుగా భోగట్టా.