మంత్రి రోజాపై కళ్యాణ్ దిలీప్ సుంకర పచ్చి బూతుల వెనుక.!

 సోషల్ మీడియా వేదికగా ‘కుప్ప తొట్టి రోజా’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది.

 మెగాస్టార్ చిరంజీవి మీద రోజా అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లనే మంత్రి రోజా మీద చిరంజీవి అభిమానులు, అందునా జనసేన కార్యకర్తలు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

 పవన్ కళ్యాణ్ మీద వైసీపీ శ్రేణులు సైతం, ఇంతకంటే నీఛంగా ట్రోలింగ్ చేయడం అనేది మామూలే.

 అయితే, ఓ మహిళా నేత మీద, అందునా మంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు ఎంతవరకు సబబు.?

 పైగా, న్యాయవాదిగా చెప్పుకునే జనసేన మద్దతుదారు, ఒకప్పటి జనసేన నేత కళ్యాణ్ దిలీప్ సుంకర, రాయడానికి వీల్లేని పదజాలాన్ని వాడుతూ ఓ వీడియో విడుదల చేశారు, రోజా మీద కౌంటర్ ఎటాక్ కోసం.

 భౌతిక దాడులకు సైతం దిగుతామని ఓ న్యాయవాది అనొచ్చా.? సోషల్ మీడియాలో చిన్న చిన్న కామెంట్లకే అరెస్టులు జరుగుతున్న రోజులివి.

 వైసీపీ వ్యతిరేకుల్నే అరెస్టు చేస్తారనుకోండి.. అది వేరే సంగతి. మరి, వైసీపీకి వ్యతిరేకంగానే కదా మాట్లాడుతున్నాడు కళ్యాణ్ దిలీప్. ఆయన్నెందుకు అరెస్టు చేయడంలేదు.?

 రోజా ఏదో మాట్లాడారు.. దానికి నాగబాబు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.. రోజా మళ్ళీ స్పందించారు..

 ఇదంతా ఆయా రాజకీయ పార్టీల నడుమ నడుస్తోన్న వ్యవహారం. కళ్యాణ్ దిలీప్, జనసేనలో వున్నారా.? వుంటే, ఆయన హోదా ఏంటి.? పచ్చి బూతులు మాట్లాడే హక్కు ఆయనకి ఎవరిచ్చారు.?

 మంత్రులు బూతులు మాట్లాడుతున్నారు కాబట్టి.. అని కళ్యాణ్ దిలీప్ తనను తాను సమర్థించుకుంటారా.?