సోషల్ మీడియాలో ‘వాల్తేరు వీరయ్య’ హంగామా వుండాల్సిన రీతిలో లేదు. దీనికి కారణమేంటి.? చిరంజీవి ‘రెంటికీ చెడ్డ రేవడి’గా మిగిలిపోవడమే.
ఓ వైపు అల్లు అర్జున్ అభిమానులు మెగా కాంపౌండ్ నుంచి వేరయ్యారు. పైగా, మెగా కాంపౌండ్ మీద బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళంతా ‘వీర సింహా రెడ్డి’ సినిమాకి మద్దతిస్తున్నారు చిత్రంగా.
మరి, పవన్ కళ్యాణ్ అభిమానులైనా చిరంజీవికి మద్దతిస్తున్నారా.? అంటే, ప్చ్.. లేదని చెప్పొచ్చేమో. జనసేన పార్టీ ఈ రోజు ఓ బహిరంగ సభ నిర్వహిస్తోంది ఉత్తరాంధ్రలో.
పవన్ అభిమానులు ఆ వ్యవహారాల్లో బిజీగా వున్నారు. ‘వి ఆర్ విత్ జెఎస్పికె’ అంటున్నారు తప్ప, ‘వాల్తేరు వీరయ్య’కి జై కొట్టడంలేదు.
‘నాకు రాజకీయాలతో సంబంధం లేదు. పవన్ దారి పవన్‌దే.. నా దారి నాదే..’
అని చిరంజీవి చేసిన తాజా వ్యాఖ్యలూ పవన్ కళ్యాణ్ అభిమానులు ‘వాల్తేరు వీరయ్య’ సినిమాపై కినుక వహించడానికి కారణంగా కనిపిస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరంజీవి ఇంతకన్నా చేయగిలిందేమీ లేదు. కానీ, స్టామినా వుండీ.. ఈ సోషల్ మీడియా మేనియాలో.. తన సినిమాకి తగినంత హైప్..
సోషల్ మీడియా వేదికగా చిరంజీవి తెచ్చుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో అయినా, చిరంజీవి ఓ ఖచ్చితమైన స్టాండ్ తీసుకుంటే.. అది వేరే లెవల్లో వుంటుంది.
గోడ మీద పిల్లి వాటంలా చిరంజీవి వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఓ వైపు, ‘నేను క్లియర్ స్టాండ్ తీసుకున్నా..
నాకేమీ సంబంధం లేదు’ అని చిరంజీవి వివరణ ఇంకో వైపు.. వెరసి, మెగాభిమానులు గందరగోళంలో వున్నారు.