చలికాలంలో వేడి నీటితో స్నానం చేస్తున్నారా…. ముందు ఇది తెలుసుకోవాల్సిందే!

 సాధారణంగా చలికాలం రావడంతో వాతావరణంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయి చాలా చల్లగా ఉంటుంది

 ఈ క్రమంలోనే చల్లని నీటితో స్నానం చేయడానికి ఎవరు ఆసక్తి చూపరు ఇలా చలికాలంలో వెచ్చగా ఉండడం కోసం వేడి నీటితో స్నానం చేస్తుంటారు

 అయితే ఇలా చలికాలంలో అధికంగా వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

 వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం…

 ముఖ్యంగా అబ్బాయిలు అధికంగా వేడి నీటితో స్నానం చేయటం వల్ల వీర్యకణాలు వేడెక్కడంతో పాటు

 నాలుగు నుంచి ఐదు రోజులపాటు శుక్రకణాల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోతుంది అదే విధంగా చర్మంపై ఎర్రటి దద్దులు ఏర్పడతాయి.

 అదేవిధంగా చాలా వేడి నీటితో స్నానం చేయటం వల్ల చర్మంలోని తేమశాతం తొలగిపోయి చర్మం పొడిబారినట్టు మారి చాలా గరుకుగా ఉండి మృదత్వాన్ని కోల్పోతుంది.

 ఇలా వేడి వేడి నీటితో స్నానం చేయటం వల్ల కంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.

 ఈ సమస్య అధికమైతే ఒక్కోసారి చూపుకోల్పోయే పరిస్థితులు కూడా ఉంటాయి.ఇలా వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల

 తలలో ఉన్నటువంటి చర్మం మొత్తం మెత్తగా మారి చుండ్రు ఏర్పడటానికి కారణమవుతుంది.

 అలాగే ఎక్కువగా జుట్టు రాలే సమస్యలు కూడా వెంటాడుతాయి. అందుకే చలికాలంలో ఎక్కువగా వేడి నీటితో స్నానం చేయకపోవడం మంచిది

 గోరువెచ్చని నీటితో స్నానం చేయటం వల్ల ఈ విధమైనటువంటి సమస్యల నుంచి దూరం ఉండవచ్చు.