త్రివిక్రమ్ సాయం కోరుతున్న బండ్ల గణేష్.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితులైన ఇద్దరు ప్రముఖులు బండ్ల గణేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ మధ్య ఎడమొహం పెడమొహం.. అన్నట్టున్నారు.

ఎక్కడ తేడా కొట్టిందోగానీ, త్రివిక్రమ్ వర్సెస్ బండ్ల.. అన్నట్టు మారింది పరిస్థితి.త్రివిక్రమ్ ఎక్కడా బండ్ల గణేష్ ప్రస్తావన తేవడంలేదుగానీ, బండ్ల గణేష్ మాత్రం ఆ మధ్య తన నోటి దురద తీర్చుకున్నాడు.

మాట జారడం, ఆ తర్వాత కవరింగ్ చేసుకోవడం బండ్ల గణేష్‌కి అలవాటే.

తాజాగా, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సంప్రదింపుల కోసం బండ్ల గణేష్ ప్రయత్నాలు ప్రారంభించాడట. అదీ, పవన్ కళ్యాణ్‌తో సినిమా కోసమట.

పవన్ ప్రస్తుతం ఖాళీగా అయితే లేడు. కానీ, ఏదో ఒక ప్రాజెక్టులో సహ నిర్మాతగా అయినా తనను ఇరికించాలని కోరుతున్నాడట బండ్ల గణేష్.

పవన్ సినిమాల వ్యవహారాల్ని త్రివిక్రమ్ దగ్గరుండి చూసుకుంటున్న సంగతి తెలిసిందే.

నిజానికి, మంచి కథ వుంటే సినిమా చెయ్యడానికి సిద్ధమని పవన్ గతంలో బండ్ల గణేష్ చెప్పాడు. కానీ, ఏమయ్యిందో.. ఆ తర్వాత సౌండ్