పవన్ విషయంలో పాట మార్చిన బండ్ల గణేష్.!.

 గాడ్ ఆఫ్ మాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు సాలిడ్ ప్రాజెక్ట్ లు అయితే ఓకే చేశారు.

 మరి వీటిలో ఆల్రెడీ అనౌన్స్ అయ్యినవి చాలానే ఉండగా ఇంకా లైనప్ లో ఉన్నవి కూడా కొన్ని ఉన్నాయి. అయితే రీమేక్ లు మధ్య లో వస్తున్నాయి కానీ

 ఎప్పుడో కమిట్ అయ్యిన సినిమాలు మాత్రం అలా నత్త నడకనే సాగుతున్నాయి.

 కాగా పవన్ తో సినిమాని ఆల్రెడీ ఓకే చేయించుకున్న ప్రముఖ నిర్మాతల్లో అయితే తన ఫ్యాన్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కూడా ఒకరు.

 మరి బండ్ల గణేష్ మళ్ళీ తన బాస్ తో గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఓ భారీ బ్లాక్ బస్టర్ తీస్తానని పవన్ మాటిచ్చిన దగ్గర నుంచి ధీమాగా ఉన్నాడు.

 కొన్ని నెలలు వరకు బ్లాక్ బస్టర్ పాట పాడిన బండ్ల గణేష్ ఇప్పుడు పాట మార్చేశాడు. సోషల్ మీడియాలో అభిమానులు బండ్ల గణేష్ తో సినిమా ఎప్పుడు అని అడగ్గా

 ఇక సినిమా ఎలా ఉంటుంది అని ఆన్సర్ ఇచ్చాడు. దీనితో పవన్ ఫ్యాన్స్ కి ఒక్కసారిగా మాట లేకుండా పోయింది.

 మరి బండ్ల గణేష్ కారణం ఏది దొరక్క ఇలా అన్నాడో ఏమో కానీ తన క్లారిటీ మాత్రం ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.