ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి వచ్చిన అవైటెడ్ చిత్రం “వీరసింహా రెడ్డి” కూడా ఒకటి.
ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేనిపై కూడా మంచి ప్రశంసలు వచ్చాయి.
అయితే మొదటి రోజు వరకు అంతా బాగానే ఉంది కానీ రెండో రోజు నాటికి మాత్రం షాకింగ్ గా వీరసింహా రెడ్డి వసూళ్లు తెలుగు రాష్ట్రాల సహా ఓవర్సీస్ లో పడిపోవడం ఆసక్తిగా మారింది.
అయ్యితే తెలుగు లో కొన్ని స్ట్రాంగ్ ఏరియాల్లో పర్వాలేదు కానీ.. ఈ సినిమాకి ఓవర్సీస్ లో నెలకొన్న బుకింగ్స్ చూసి సింపుల్ గా 1 మిలియన్ కొట్టేస్తుంది
అని అంతా అనుకున్న కానీ సినిమా వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా ఈ మార్క్ ఈ చిత్రం అందుకోలేదు.
ఇప్పుడు మరింత స్థాయిలో ఈ సినిమా వసూళ్లు డ్రాప్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
మరి ఈ సినిమాకి ఎందుకు ఇలా జరుగుతుందో ఇక్కడ కొంతమంది అభిమానులకి అయితే అర్ధం అవ్వట్లేదు.
లక్షల డాలర్స్ నుంచి ఇప్పుడు కేవలం వేలు పదివేల డాలర్స్ లోనే వసూళ్లు వస్తున్నాయి. మరి మళ్ళీ వీరసింహా రెడ్డి ఏమన్నా పుంజుకుంటాడో లేదో అనేది చూడాలి.
ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా మైత్రి మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.