బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముందుకు దూసుకెళ్తోంది. ముఖ్యంగా రెండవ సీజన్లో ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు.
ఇక ఈ కార్యక్రమానికి ప్రభాస్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు రాబోతున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున ఈ ఎపిసోడ్ లపై అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ప్రభాస్ ఎపిసోడ్ మాత్రం రెండు భాగాలుగా ప్రసారం చేయనున్నట్లు ఇదివరకే ఆహా అధికారికంగా ప్రకటించింది. ఇక మొదటి ఎపిసోడ్ డిసెంబర్ 30వ తేదీ ప్రసారం కానున్నట్లు తెలిపారు.
తాజాగా విడుదలైన ప్రోమోలో భాగంగా ప్రభాస్ పెళ్లి గురించి బాలకృష్ణ డైరెక్ట్ గా ప్రశ్నించారు.
ఈ ప్రోమోలో భాగంగా ప్రభాస్ ను బాలయ్య మాట్లాడుతూ… డార్లింగ్ అని పిలిస్తే దయ్యాలు కూడా దేవతలుగా మారిపోతాయి అంటూ చెప్పుకొచ్చారు.
నీ ఫ్రెండ్స్ ని నువ్వు ఏమని పిలుస్తావు అంటూ అడగడంతో డార్లింగ్ అని పిలుస్తానని సమాధానం చెప్పారు. మరి గర్ల్ ఫ్రెండ్స్ ని ఏమని పిలుస్తావు అంటూ వెంటనే బాలయ్య ప్రశ్న వేశాడు.
అదేంటో ఈ మధ్య మర్చిపోతున్నాను సార్ అంటూ ప్రభాస్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. నేను కూడా నీ మాయలో పడిపోయానని బాలయ్య చెప్పారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ప్రభాస్ పెళ్లి గురించి కూడా ప్రస్తావనకు తీసుకోవచ్చారు..
ఏంటి అసలు పెళ్లి ఉందా లేదా అని బాలకృష్ణ అడిగేయడంతో ప్రభాస్ మాత్రం ఇంకా రాసిపెట్టినట్టు లేదు అంటూ సమాధానం చెప్పారు.
ప్రభాస్ ఇలా సమాధానం చెప్పడంతో బాలకృష్ణ నువ్వు మీ అమ్మకు చెప్పిన సమాధానాలు చెప్పకయ్యా అంటూ మాట్లాడారు.
మొత్తానికి తాజాగా విడుదల చేసిన ప్రోమోలో బాలకృష్ణ ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడారు మరి పెళ్లి గురించి ప్రభాస్ ఇంకా ఏం చెబుతారు ఏంటి అనే విషయం తెలియాలంటే డిసెంబర్ 30 వ తేదీ వరకు వేచి చూడాలి.