అతడితో మళ్ళీ బాలయ్య.!

 టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా ఇప్పుడు నటించిన అవైటెడ్ మాస్ చిత్రం వీరసింహా రెడ్డి భారీ హిట్ కాగా

 ఈ సినిమా తర్వాత బాలయ్య తన కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా సాలిడ్ సినిమాలు లైనప్ ని సెట్ చేసుకొని

 మళ్ళీ సినిమాల పరంగా ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. దీనితో తన స్టామినా కి తగ్గ భారీ వసూళ్లు తాను ఓపెనింగ్స్ కి రాబడుతూ ఉండగా

 ఇప్పుడు బాలయ్య అయితే తన కెరీర్ లో మరిన్ని అదిరే సినిమాలు ఓకే చేస్తున్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.

  అలాగే ఇప్పుడు ఓ ప్లాప్ దర్శకుడికి బాలయ్య అవకాశం ఇచ్చినట్టుగా రూమర్ మొదలైంది.

 మరి ఆ దర్శకుడు మరెవరో కూడా కాదట. బాలయ్య కి పైసా వసూల్, రీసెంట్ గా లైగర్ లాంటి భారీ ప్లాప్ లు అందుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ తో అట.

 కాగా ఇప్పుడు బాలయ్య తన తదుపరి సినిమా అంటే తన 109వ సినిమా అయితే అవకాశం ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది.

 మరి దీనిపై ఇంకా అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది కానీ బాలయ్య సినీ వర్గాల నుంచి ఈ టాక్ నిజమే అన్నట్టుగా తెలుస్తుంది.

 ప్రస్తుతం పూరీ కూడా లైగర్ తర్వాత ఏ సినిమాకి కమిట్ అవ్వలేదు. మరి తాను బాలయ్యతోనే చేస్తాడా లేక వేరే హీరో తో చేస్తాడా అనేది వేచి చూడాల్సిందే.

 అలాగే బాలయ్య ప్రస్తుతం అనీల్ రావిపూడి తో సినిమా చేస్తున్నారు.