వారికి క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ.!

రీసెంట్ గా టాలీవుడ్ దగ్గర వచ్చి సూపర్ సక్సెస్ టాక్ అందుకున్న లేటెస్ట్ చిత్రాల్లో నందమూరి నటసింహ మాస్ గాడ్ బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వీరసింహా రెడ్డి” కూడా ఒకటి.

మరి ఈ చిత్రం రిలీజ్ అయ్యి మూడు రోజులు కాగా చిత్ర యూనిట్ అంతా సినిమా రిలీజ్ కి ముందు భారీ ఎత్తున ప్రమోషన్స్ ని చేశారు అలాగే నెక్స్ట్ కూడా సక్సెస్ మీట్ లలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

అయితే ఇటీవల బాలయ్య చేసిన కొన్ని వ్యాఖ్యలు దేవాంగులలో సంచలనంగా మారాయి,

దీనితో ఇది కాంట్రవర్సీ కి దారి తీసేలా మారగా తాజాగా సోషల్ మీడియా ద్వారా అయితే బాలయ్య తన క్లారిటీ ఇచ్చారు.

“దేవబ్రాహ్మణ సోదరసోదరీమణులకు మీసోదరుడు నందమూరి బాలకృష్ణ మనఃపూర్వక మనవి ..

దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని నాకందిన సమాచారం తప్పు అని నాకు తెలియజెప్పిన దేవబ్రాహ్మణ పెద్దలందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను

..నేనన్న మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డాను ..

నాకు ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచన లేదు , ఉండదని కూడా తెలుగు ప్రజలందరికీ తెలుసు .. దురదృష్టవశాత్తూ ఆసందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే ..

అంతేకానీ సాటిసోదరుల మనసు గాయపరచటం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి..

పైగా దేవాంగులలో నా అభిమానులు చాలామంది ఉన్నారు ..నావాళ్లను నేను బాధపెట్టుకుంటానా ?.. అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను.

పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నాను .. మీ సోదరుడు” బాలకృష్ణ అంటూ తనని మన్నించమని కోరుకున్నారు. దీనితో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.