లేటెస్ట్ గా టాలీవుడ్ లో వచ్చిన పలు షాకింగ్ వార్తల్లో ప్రముఖ నటుడు మరియు రాజకీయ నాయకుడు అయినటువంటి నందమూరి తారక రత్న పై వచ్చిన వార్తలు కూడా సంచలనంగా మారాయి.
ఏపీ ప్రతిపక్ష పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు యువ అధ్యక్షుడు నారా లోకేష్ చేపట్టిన పాద యాత్ర ఏమో కానీ ఈ నటుడు ప్రాణం మీదికి అయ్యితే అది తీసుకొచ్చింది.
నిన్న కుప్పంలో పాల్గొన్న తారకరత్న ఊహించని విధంగా భారీ ఎత్తున పార్టీ అభిమానులు చుట్టేయడంతో ఊపిరాడక గుండె పోటు పాలయ్యారు.
దీనితో వెంటనే దగ్గరలో హాస్పిటల్ కి తీసుకెళ్లగా అక్కడ నుంచి నెక్స్ట్ బెంగళూర్ కి తీసుకెళ్లారు,
నిన్న అర్ధ రాత్రి తనని షిఫ్ట్ చేయగా ఎన్టీఆర్ సహా బాలయ్య లు కూడా తారక రత్న ఆరోగ్యంపై ఆరా తీశారు.
ఇక ఇప్పుడు వీరితో పాటుగా చంద్రబాబు నాయుడు అయితే తారక రత్న కోసం కదలనున్నట్టుగా సినీ వర్గాల్లో లేటెస్ట్ అప్డేట్.
మరి బాబు అయితే ఈరోజు సాయంత్రం తారక రత్న ని కలిసేందుకు వెళ్లనున్నారట.
విజయవాడ నుంచి స్టార్ట్ అవ్వనున్నారట. అయితే ఆల్రెడీ తారక రత్న కి డాక్టర్ చికిత్స చేశారట.
అలాగే ఇప్పుడు తన హెల్త్ స్టేబుల్ గానే ఉన్నట్టుగా సమాచారం. దీనితో ఈ లేటెస్ట్ అప్డేట్ సినీ మరియు రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారింది.