ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. కానీ.. అప్పుడే ఆ కాక మొదలైపోయింది. అధికార పక్షం సంగతి కాసేపు పక్కన పెడితే…
ప్రతిపక్షం టీడీపీ మాత్రం తెగ టెన్షన్ పడిపోతూ.. ఈసారి జంపింగ్ జపాంగులను నమ్ముకుని మాగ్జిమం ముందుకు వెళ్లాలని భావిస్తుందట!
అందులోభాగంగాఇప్పటికేకన్నాలక్ష్మీనారాయణకు పసుపు కండువా కప్పేసిన బాబు..త్వరలో మరికొంతమంది కాషాయ నేతలకు పసుపు కండువా కప్పాలనిభావిస్తున్నారంట.
ఇదే క్రమంలో… తెలంగాణ కాంగ్రెస్ లీడర్ రేణుకా చౌదరి ని కూడా సైకిల్ ఎక్కించుకోవాలని చూస్తున్నారంట చంద్రబాబు!
ఈ దఫా ఎన్నికలు బాబుకు చివరి ఎన్నికలు అని అంటున్నారు తమ్ముళ్లు! అందుకే బాబు కూడా “లాస్ట్ ఛాన్స్” అనే సెంటిమెంట్ పాలిటిక్స్ మొదలుపెట్టారు!
అంటే… ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచి, తద్వారా పార్టీ నిలిచి.. ఫలితంగా చినబాబు పొలిటికల్ కెరీర్ కు భరోశా కలగాలని బాబు భావిస్తున్నారట!
ఇందులో భాగమే నిన్న “కన్నా లక్ష్మీనారాయణను చేర్చుకోవడం అని.. రేపు ఇంకొకరిని చేర్చుకునే ప్లాన్స్ అని అంటున్నారు! ఈ క్రమంలోనే..
రేణుక చౌదరిని కూడా సైకిల్ ఎక్కించుకుని.. ఏపీలో కమ్మ సామాజికవర్గ జనాభా ఎక్కువగా ఉన్న స్థానం నుంచి పోటీ చేయించాలని బాబు భావిస్తున్నారంట!
గతంలో రేణుక చౌదరి తెలుగుదేశంలో ఉన్నప్పుడు… చంద్రబాబుతో ఆమెకు స్నేహపూర్వకమైన బంధం ఉండేదట. దీంతో… ఆ నాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తున్న బాబు..
ఈసారికి ఏపీలో తమ పార్టీ నుంచి పోటీచేయాలని రిక్వస్ట్ చేస్తున్నారంట. అందుకు రేణుక కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది!
అందులో భాగంగానే… తెలంగాణలో కేసీఆర్ పై కంటే ఎక్కువగా ఏపీలో జగన్ పై విమర్శలు చేయడం అని అంటున్నారు
విశ్లేషకులు! మరి రేణుక చౌదరి ఎప్పుడు సైకిల్ ఎక్కుతారనేది వేచి చూడాలి!