తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఇలా మెగా కుటుంబం నుంచి ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఈ క్రమంలోనే మెగా వారసురాలుగా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి నిహారిక పెళ్లికి ముందు పలు సినిమాలలో హీరోయిన్ గా నటించిన అనంతరం ఈమె నిర్మాతగా స్థిరపడ్డారు.
ఇలా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నటువంటి నిహారిక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.
అందుకు గల కారణం ఈమె ఈ మధ్య పార్టీలకు వెళ్లిన వెకేషన్ కి వెళ్ళిన ఒంటరిగా కనిపించడమే.
నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత వీరిద్దరూ పలు వెకేషన్ లకు వెళుతూ ఎంజాయ్ చేశారు.
అయితే ఈ మధ్యకాలంలో నిహారిక ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగానే కనపడుతున్నారు. ఈమె వెంట తన భర్త చైతన్య లేకపోవడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి.
ఇక తాజాగా మెగా ఫ్యామిలీలో జరిగిన సీక్రెట్ శాంట సెలబ్రేషన్స్‌లో భాగంగా మెగా కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నప్పటికీ నిహారిక భర్త చైతన్య మాత్రం కనిపించడం లేదు.
ఇలాంటి పార్టీలన్నింటికీ చైతన్య ఫ్యామిలీ చాలా దూరంగా ఉంటుందని అందుకే మెగా ఫ్యామిలీలో జరిగే పార్టీలకు ఆయన దూరంగా ఉంటారని సమాచారం.
అయితే నిహారిక వ్యవహారి శైలి కారణంగా తమ అత్తింటి సభ్యులు ఎంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నిహారికకు ఇకపై ఇలాంటి పార్టీలు,పబ్ లకు
వెళ్లడాలు మానుకోవాలని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తనకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
ఇకపై ఇలాంటివన్నీ మానుకొని అత్తింటి వారికి అనుగుణంగా ఆ ఇంటి గౌరవం నిలబెట్టేలా నడుచుకోవాలని నిహారికకు వార్నింగ్ ఇచ్చినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.