ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజిస్తున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి…?

 మన హిందూ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రజలందరూ ప్రతిరోజు ఇంట్లో తనం తప్పకుండా ప్రజలు చేస్తూ ఉంటారు.

 ఇలా వారంలో ఉన్న ఏడు రోజులు కూడా ఒక్కో దేవుడికి అంకితం చేయబడ్డాయి. ముఖ్యంగా సోమవారం శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. అందువల్ల ప్రతి సోమవారం శివ పూజ చేస్తూ ఉంటారు.

 కొంతమంది ఆలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేసి దర్శించుకుంటే మరి కొంతమంది ఇంట్లోనే శివలింగాన్ని పెట్టి అభిషేకం చేస్తూ ఉంటారు. సాధారణంగా ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా? లేదా?

 అని చాలామందికి సందేహం ఉంటుంది. ఒకవేళ ఇంట్లో శివలింగం పెట్టి పూజించాలి అనుకునేవారు ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

 శివలింగాన్ని ఇంట్లోంచి పూజించాలి అనుకునేవారు ప్రధానంగా శివలింగం ఎంత ఎత్తు ఉంటే మంచిదో తెలుసుకోవాలి. ఏదైనా విగ్రహాలు కానీ శివలింగం కానీ ఇంట్లో ఉంచి పూజించేటప్పుడు

  వాటి ఎత్తు కేవలం అంగుష్టమాత్రం పరిమాణం ఉంటే మంచిది. అంటే మన బొటనవేలు కన్నా పెద్ద పరిమాణంలో ఉన్న శివలింగం ఇంట్లో ఉంచరాదు.

 ఇక ఇంట్లో ఎన్ని శివలింగాలు ఉండవచ్చు అనేది చాలామందికి అనుమానం ఉంటుంది. ప్రతిరోజు నిష్టగా వేద మంత్రాలతో అభిషేకం చేయగలిగితే..

 ఇంట్లో రెండు శివలింగాలైనా ఉంచుకోవచ్చు. ఇలా ఇంట్లో శివలింగాన్ని పెట్టుకున్న తర్వాత క్రమం తప్పకుండా ప్రతిరోజు అభిషేకార్చనలు చేయాలి.

 కానీ, ఇంట్లో ఎప్పుడైనా అశుచి దోషం కలిగే ప్రమాదం ఉంటుంది. అటువంటి సమయంలో శివలింగానికి పూజలు చేయడం అసంభవం. అందువల్ల శివలింగానికి బదులుగా

 చిన్న సాలగ్రామ శిలారూప శివలింగార్చన శ్రేయస్కరం. అప్పుడైనా నిత్యం రుద్రాధ్యాయ సహిత అభిషేకం విధిగా చేయాలి.

 ఇలా ప్రతిరోజు పూజ చేయడం కుదరని వారు వాటిని ఏదైనా శివాలయంలో సమర్పించవచ్చు. అయితే శుచి, శౌచం పాటించాలి.

 వెండి, బంగారం, సాలగ్రామం, పాలరాయి, పాదరసం లేదంటే మృత్తికతో అప్పటికప్పుడు మట్టితో పార్థివ లింగం తయారుచేసుకుని శివుని అర్చించవచ్చు.