సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో బొద్దింకలు కనిపించడం సర్వసాధారణం. ఇవి ఎక్కువగా కిచెన్ లో మనకు కనబడుతూ ఉంటాయి.
సింకులలోను అలాగే కిచెన్ కబోర్డ్స్ లోనూ బొద్దింకలు అధికంగా కనపడుతూ ఉంటాయి. అయితే బొద్దింకలు వంటింట్లో తిరగడం చాలా ప్రమాదకరం
బొద్దింకలు బ్యాక్టీరియాలకు వాహకాలుగావ్యవహరిస్తాయి.పొరపాటున ఇవి ఆహారంపై తిరగడం వల్ల మనకు తెలియకుండా ఆహారాన్ని తినడంతో ఫుడ్ పాయిజన్
అయి వాంతులు విరోచనాలు వంటివి జరగడానికి బొద్దింకలు పరోక్షంగా కారణమవుతూ ఉంటాయి.
ఇలా బొద్దింక సమస్యలతో బాధపడేవారు ఈ సింపుల్ చిట్కాలను ఉపయోగించి ఈ సమస్యకు పూర్తిగా చెక్ పెట్టవచ్చు.బొద్దింకలకు బేకింగ్ సోడా అసలు పడదు
అందుకే పంచదారలో కాస్త బేకింగ్ సోడా కలిపి బొద్దింకలు తిరిగే చోట వేయటం వల్ల ఈస్ బేకింగ్ సోడా ప్రభావం వల్ల బొద్దింకలు చనిపోతాయి.
అదేవిధంగా కాఫీలో ఉన్నటువంటి కెఫెన్ బొద్దింకలను చంపడానికి దోహదం పడతాయి అందుకే బొద్దింకలు ఎక్కువగా తిరిగే చోట కాస్త కాఫీ పౌడర్ చల్లడం
వల్ల వీటి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.బొద్దింకలను తరిమి కొట్టడానికి పుదీనా ఆకులు మంచి ఔషధంలా పనిచేస్తాయి
ఎక్కడైతే బొద్దింకలు ఉంటాయో ఆ ప్రదేశంలో పుదీనా ఆకులు పెట్టడం వల్ల వాటి నుంచి వచ్చే పరిమళానికి బొద్దింకలు చనిపోతాయి.
అదేవిధంగా ఒక ఉల్లిపాయ ఐదు వెల్లుల్లి రెబ్బలు కాస్త లవంగాలు నీటిలో బాగా మరిగించి ఆ నీటిని ఎక్కడైతే బొద్దింకలు తిరుగుతాయో ఆ ప్రదేశంలో స్ప్రే చేయడం వల్ల
బొద్దింకలుఇందులోనుంచివచ్చేవాసననుభరించలేకచనిపోతాయి.ఇలాసింపుల్చిట్కాలనుఉపయోగించిబొద్దింకలకుచెక్పెట్టవచ్చు.