సాధారణంగా మనం తయారు చేసుకునే ఆహార పదార్థాలకు రుచి రావాలి అంటే తప్పనిసరిగా ఆహార పదార్థాలలో తగినంత ఉప్పు కారం వేసుకోవాలి.
ఇలా ఉప్పు కారం వేసుకున్నప్పుడే ఆ వంటలకు సరైన రుచి వస్తుంది.అయితే చాలామంది ఉప్పును అధికంగా తినడానికి ఇష్టపడతారు
ఆహార పదార్థాలలో వేసే ఉప్పు మాత్రమే కాకుండా మరింత అదనంగా ఉప్పు తినడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు.
ఇలా ఎక్కువగా ఉప్పు తీసుకునే వారిలో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు పలు పరిశోధనల ద్వారా వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఆహార పదార్థాలలో ఉప్పు అధికంగా తినటం వల్ల చాలామందిలో గుండెపోటు అధిక రక్తపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేశారు.
ఇక తక్కువ శాతంలో ఉప్పు తినేవారికన్నా అధికంగా ఉప్పు తీసుకునే వారిలో మరణం తొందరగా సంభవిస్తుందని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేశారు.
ఇలా ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్యతో పాటు గుండెపోటు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
50 సంవత్సరాలు పైబడిన వారు అధికంగా ఉప్పు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని ఇలా ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల తొందరగా ఆయుష్షు తగ్గుతుందని వెల్లడించారు
అందుకే ప్రతిరోజు రెండు నుంచి ఐదు గ్రాముల వరకు మాత్రమే ఉప్పును తీసుకోవాలి.
ఇలా ఐదు గ్రాముల వరకు ఉప్పు తీసుకున్న వారు మాత్రమే ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని నిపుణులు ఈ పరిశోధనల ద్వారా తెలియజేశారు.