ప్రస్తుత కాలంలో వాతావరణంలో మార్పులు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య అధికమైంది.
ముఖ్యంగా చుండ్రు సమస్య మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది.చల్లని వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మన చర్మం పొడిబారుతుంది.
పొడిబారిన చర్మం వల్ల తలలో మృత కణాల సంఖ్య పెరిగి తెల్లని పొట్టు పైకి లేస్తుంది దాన్నే చుండ్రు అని కూడా అంటారు. శీతాకాలంలో ఈ సమస్య మరి తీవ్రంగా ఉంటుంది.
చుండ్రు సమస్య నుంచి బయటపడడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ చుండ్రు సమస్య నుంచి మాత్రం బయటపడలేకపోతున్నారు
అయితే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చుండు సమస్యను అధిగమించడానికి సహజ పద్ధతిలో కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
యాంటీ బ్యాక్టీరియల్ ,ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్న మెంతులను రాత్రంతా నానబెట్టి మరసటి రోజు మెత్తటి మిశ్రమంగా మార్చి ఈ మిశ్రమాన్ని తల కుదుళ్లకు అంటే విధంగా మర్దన చేసుకుంటే
చుండ్రు సమస్య తొలగి వెంట్రుకలు దృఢంగా కాంతివంతంగా తయారవుతాయి.శీతాకాలంలో చల్లని వాతావరణం ఉన్నప్పుడు తల స్నానానికి వేడి నీళ్లను వాడుతాం అది పొరపాటు.
వేడి నీళ్లు వాడటం వల్ల మాడుపై చర్మం పొడిబారి చుండ్రు సమస్య మరింత ఎక్కువవుతుంది. వేడి నీటికి బదులు గోరువెచ్చని నీటిని వాడడం మంచిది.
వేప ఆకులను మెత్తని పేస్టుగా మార్చుకొని తలకు మర్దన చేసుకుంటే వేపాకులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రు సమస్యను తొలగించడంతోపాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
అలాగే వేప నూనె, కొబ్బరి నూనె,ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు మర్దన చేసుకొని 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
తాజా నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి జుట్టు కుదుళ్లకు అంటే విధంగా మర్దన చేసుకుంటే చుండ్రు సమస్య తొలగిపోతుంది.