సాధారణంగా యాపిల్ పండ్లు అనగానే టక్కున మనందరికీ రెడ్ యాపిల్ పండ్లే గుర్తుకొస్తాయి. వీటిని తినడానికి ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తారు.
గ్రీన్ యాపిల్ పండ్లలో కూడా మన శరీర జీవక్రియలకు అవసరమైన విటమిన్స్, మినరల్స్, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్, కాల్షియం, ఐరన్ , పీచు పదార్థం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
అందుకే ప్రతిరోజు ఒక గ్రీన్ ఆపిల్ పండును ఆహారంగా తీసుకుంటే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అత్యధిక విటమిన్ సి లభ్యమయ్యే గ్రీన్ యాపిల్ పండ్లను రోజువారి ఆహారంలో చేర్చుకుంటే మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొంది సీజనల్గా వచ్చే అనేక ఇన్ఫెక్షన్, అలర్జీ సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.
ముఖ్యంగా అల్జీమర్ వ్యాధితో బాధపడేవారు తరచూ గ్రీన్ యాపిల్ తీసుకుంటే వీటిలో పుష్కలంగా ఉన్నయాంటీ ఆక్సిడెంట్,మెగ్నీషియం,క్వెర్సెటిన్ అనే మూలకం మెదడు చురుకుదనాన్ని పెంచి జ్ఞాపక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
గ్రీన్ యాపిల్ పండ్లలో పుష్కలంగా ఉన్న యాంటీ అలెర్జిటిక్ లక్షణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శ్వాస వ్యవస్థను దృఢపరిచి ఉబ్బసం,ఆస్మా,
నిమోనియా వంటి సమస్యలను అదుపు చేయడంతో పాటు ఊపిరితిత్తుల పని తీరును బలోపేతం చేసి శ్వాస సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
గ్రీన్ ఆపిల్ పండులో సామృద్దిగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లభిస్తాయి. విటమిన్ సి మన శరీరానికి అవసరమైన ఐరన్ ను గ్రహించడంలో సహాయపడి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి ప్రమాదకర రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.
ముఖ్యంగా గర్భిణీ మహిళలు, పాలిచ్చే తల్లులు, వయసు మళ్ళిన మహిళల్లో సహజంగానే ఐరన్ లోపం ఏర్పడుతుంది కావున వీరు రోజువారి ఆహారంలో గ్రీన్ ఆపిల్ తీసుకోవడం మంచిది.
గ్రీన్ యాపిల్ లో పుష్కలంగా ఉన్న కాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచుతుంది. వయసు దాటిన తర్వాత మహిళల్లో ఎముకలు బలహీనపడతాయి.
అటువంటి పరిస్థితిలో మీరు ప్రతిరోజూ గ్రీన్ యాపిల్ తినవచ్చు. తరచూ గ్రీన్ యాపిల్ ఆహారంగా తీసుకుంటే వీటిలో సమృద్ధిగా ఉన్న ఫైబర్, అమైనో ఆమ్లాలు జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. లివర్ ఇన్ఫెక్షన్లను తగ్గించి పని తీరును మెరుగు పరుస్తుంది.