సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలోను ప్రేమ పుట్టడం సర్వసాధారణం అయితే కొందరిని చూడగానే మొదటిసారి ప్రేమ కలుగుతుంది.
అయితే మరికొందరిని చూడగానే ఆకర్షణ కలుగుతుంది. అయితే చాలామంది వారికి ఇతరులపై ఉన్నది ప్రేమ లేక ఆకర్షణ అనేది తెలియక ఎంతో సతమతమవుతుంటారు.
మరి ఇతరుల పట్ల మీకు ఉన్నది ప్రేమ లేక ఆకర్షణ అనేది తెలుసుకోవాలంటే ఇలా ట్రై చేయండి.
మీరు ప్రేమలో ఉన్నారా లేక ఆకర్షణలో ఉన్నారా అనే విషయం తెలుసుకోవాలి అంటే మీరు కనుక ఓ వ్యక్తితో నిజంగా ప్రేమలో
కనుక ఉంటే ఆ వ్యక్తి పేరును తరచూ తలుచుకుంటూ ఉంటారు.ఆ వ్యక్తి గురించి మాట్లాడటానికి సందర్భం లేకపోయినా తన ప్రస్తావన
తీసుకువస్తూ తన పేరు తలుచుకుంటూ ఉంటే తప్పనిసరిగా మీరు ప్రేమలో ఉన్నారని అర్థం.
మీరు మీరు ప్రేమించే వ్యక్తి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు అంటే మీ ఇద్దరి మధ్య ఉన్నది ఆకర్షణ కాదు ప్రేమ అని అర్థం.
ఇక మీరు ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నప్పుడు తను ఏ పని చెప్పినా చేయడానికి ప్రయత్నం చేస్తారు.
ఇదివరకు మీరు ఆ పనులు ఎప్పుడు చేయకపోయినా చేయడానికి ప్రయత్నం కనుక చేస్తే మీరు తనతో ప్రేమలో ఉన్నట్టు అర్థం.
ఇక ప్రేమలో ఉన్నవారు ఎప్పుడు మాట్లాడిన నేను అనే పదానికి బదులుగా మేము అనే పదం వాడతారు.
ఇలా మేము అనే పదం ఎప్పుడైతే వాడుతారో అప్పుడు వారు ప్రేమలో ఉన్నట్టు అర్థం.
మీరు కనుక ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే తప్పనిసరిగా మీరు ప్రేమలో ఉన్నారని మీరు ఆకర్షణ కాదు అని అర్థం.